AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health News: మీరు తినే భోజనంలో తెలిసో, తెలియకో వీటిని వాడుతున్నారా.. వెంటనే స్వల్ప మార్పులతో బహుళ ఆరోగ్య ప్రయోజనాలు..

Health News: కరోనా తర్వాత ప్రజల అలవాట్లలో, జీవనశైలిలో ఎన్నో మార్పులు వచ్చాయి.  చాలామంది తమ ఆరోగ్యంపై దృష్టి సారిస్తున్నారు. మంచి పోషకాలు ఉండే ఆహారం తినడానికి మొగ్గు చూపుతున్నారు. ప్రతి ఒక్కరు వ్యాయామం, యోగా చేస్తున్నారు. అలాగే ఆహారం..

Health News: మీరు తినే భోజనంలో తెలిసో, తెలియకో వీటిని వాడుతున్నారా.. వెంటనే స్వల్ప మార్పులతో బహుళ ఆరోగ్య ప్రయోజనాలు..
Oil Food
Follow us
Amarnadh Daneti

|

Updated on: Jan 09, 2023 | 1:34 AM

Health News: కరోనా తర్వాత ప్రజల అలవాట్లలో, జీవనశైలిలో ఎన్నో మార్పులు వచ్చాయి.  చాలామంది తమ ఆరోగ్యంపై దృష్టి సారిస్తున్నారు. మంచి పోషకాలు ఉండే ఆహారం తినడానికి మొగ్గు చూపుతున్నారు. ప్రతి ఒక్కరు వ్యాయామం, యోగా చేస్తున్నారు. అలాగే ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. అయినప్పటికి తెలిసో తెలియక ఆహారం విషయంలో కొన్ని తప్పులు చేస్తున్నారు. ఓ వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే తినే ఆహారంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలి. కొంతమంది అన్ని విషయాల్లో జాగ్రత్తలు పాటించినా.. ఆహారం విషయంలో మాత్రం నిర్లక్యంగా వ్యవహరిస్తుంటారు. కాని ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉంటే.. ఎన్నో ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉన్నట్లే, అందుకే భోజనం తయారుచేసుకునేటప్పుడు వాడే పదార్థాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబ సభ్యులు రోగాలకు దూరంగా ఉండాలంటే భోజనంలో ఈ 5 మార్పుల గురించి తెలుసుకోవాలి. వీటిని పాటిస్తే అందరు ఆరోగ్యంగా ఉంటారు. అంతేకాదు బహుళ ఆరోగ్య ప్రయోజనాలు కూడా. అవేంటో ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

నూనెల ఎంపిక

కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండే నూనెలను తీసుకోవడం తగ్గించండి. ఒమేగా 3 కొవ్వు ఉండే ఆహారాన్ని తీసుకోండి. ఒమేగా 6, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు మన శరీరానికి సమాన పరిమాణంలో అవసరం. రిఫైన్డ్ ఆయిల్స్ అధికంగా తీసుకోవడం వల్ల శరీరంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. వంటకాలలో ఎక్కువగా నెయ్యి, ఆలివ్ నూనె, ఆవ నూనెను వాడటం మంచిది.

కార్బోహైడ్రేట్లు

మనం తినే అన్నం, గోధుమలు, రొట్టె, కూరగాయలు, పండ్లలలో ఎంతోకొంత కార్బోహైడ్రేట్‌లు ఉంటాయి. ఇవి విభిన్న పరిమాణంలో ఉంటాయి. అయితే కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే కొవ్వులు, నూనెలు తీసుకోవడవం తగ్గించాలి. నూడుల్స్, బిస్కెట్లు, పాస్తా వంటి ప్రాసెస్ చేయబడిన ఆహారాలుఉ తీసుకోవడం తగ్గించండి. మీ ఆహారంలో రాగి, కొర్రలు, గోధుమలు వంటి ఆహారాలు ఉండే విధంగా చూసుకోండి. పప్పులు, గింజలను పెంచండి. సమతుల్య ఆహారం కోసం తృణధాన్యాలు తీసుకోవడం చాలా మంచిది.

ఇవి కూడా చదవండి

గుడ్లు, చేపలు

పాలు, గుడ్డు, జున్ను, పెరుగు, మాంసం, చికెన్ తగినంత తీసుకోవడం అవసరం. ఇవి శరీరానికి కావలసిన సూక్ష్మపోషకాలను అందిస్తాయి. శాఖాహారులు తరచుగా విటమిన్ బి 12 లోపం కలిగి ఉంటారు. పాల ఉత్పత్తులను తీసుకోవడం వల్ల దీనిని కవర్‌ చేయవచ్చు.

చక్కెరను తగ్గించండి

స్వీట్లు, చాక్లెట్‌లు, కూల్‌ డ్రింక్స్ తగ్గించండి. ఇందులో చక్కెర అధికంగా ఉంటుంది. ఇవి అధిక కేలరీలను కలిగి ఉంటాయి. ఇవి ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతాయి.

విత్తనాలు

వివిధ రకాల విత్తనాలలో కొవ్వులు, ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, జింక్, విటమిన్ బి -6 ఇతర విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఒమేగా 3 పొందడానికి మీరు అవిసె గింజలు, చియా విత్తనాలను డైట్‌లో చేర్చాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..