Andhra Pradesh: 25 కేజీల బియ్యం కోసం కాదు.. 25యేళ్ల భవిష్యత్తు ఇవ్వడానికే.. జనసేనాని పవర్‌ఫుల్ డైలాగ్.. యువశక్తిపై వీడియో రిలీజ్..
Janasena Yuva Shakti: ఉత్తరాంధ్ర ప్రజల సమస్యలపై యువత తమ సమస్యలు తెలియజేసేందుకు జనసేన ఆధ్వర్యంలో ఈనెల 12వ తేదీన శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో యువశక్తి కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని జనసేన పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. స్వామి వివేకానంద జయంతి..
Janasena Yuva Shakti: ఉత్తరాంధ్ర ప్రజల సమస్యలపై యువత తమ సమస్యలు తెలియజేసేందుకు జనసేన ఆధ్వర్యంలో ఈనెల 12వ తేదీన శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో యువశక్తి కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని జనసేన పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. స్వామి వివేకానంద జయంతి రోజైన జనవరి 12వ తేదీన ఈకార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి హాజరవుతారు. భారీ సంఖ్యలో యువత వచ్చే అవకాశం ఉండటంతో భద్రతాపరంగానూ అవసరమైన చర్యలు తీసుకుంటూ ఏర్పాట్లు చేస్తున్నారు. భారతదేశానికి యువత వెన్నెముక అని, ప్రపంచంలో అత్యధిక యువత ఉన్న భారత్‌లో యువత అభిప్రాయాలను వారి నోటి ద్వారానే వినే కార్యక్రమం చేబడుతున్నామని ఇప్పటికే పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లను పార్టీ సీనియర్ నేత నాదేండ్ల మనోహర్ సైతం పరిశీలించారు. వైసీపీ ప్రభుత్వంలో యువత పడుతున్న సమస్యలను వారి నోటినుంచే చెప్పించేలా ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. వేలమంది యువత ఈ కార్యక్రమానికి హాజరవుతారని అంచనా వేస్తున్నారు.
జనసేన యువశక్తి కార్యక్రమం నేపథ్యంలో మన యువత.. మన భవిత అంటూ ఓ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు జనసేనాని పవన్ కళ్యాణ్. జనవరి 12న రణస్థలంలో ‘వాయిస్ ఆఫ్ యూత్’ వినాలని ఎదురుచూస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు. దిక్కులు పిక్కటిల్లేలా జనసేన సమక్షంలో నీ గళం వినిపించు అంటూ పిలుపు నిచ్చారు పవన్ కళ్యాణ్. 25కేజీల బియ్యం ఇవ్వటానికి తాను రాలేదని, 25 ఏళ్ల భవిష్యత్తు ఇవ్వడానికి జనసేన ఉందంటూ ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..