APPSC Group -1: మరికాసేపట్లో గ్రూప్ -1 పరీక్ష.. ఆ టైమ్ దాటితే నో ఎంట్రీ.. నియమ నిబంధనలు ఇవే..
నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ - 1 పరీక్షలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని...
నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ – 1 పరీక్షలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని గ్రూప్–1 పోస్టుల భర్తీకి ఇవాళ (ఆదివారం) ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది. ఇందు కోసం ఏపీపీఎస్సీ అన్ని ఏర్పాట్లు చేసింది. 18 జిల్లాల్లోని 297 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. మొత్తం 1,26,449 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరు కానున్నారు. ఉదయం 10 గంటల నుంచి 12 వరకు పేపర్–1, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు పేపర్–2 నిర్వహిస్తారు. ఒక్కో పేపర్‌లో 120 చొప్పున ప్రశ్నలుంటాయి. అభ్యర్థులు హాల్ టిక్కెట్లతోపాటు గుర్తింపు కార్డును పరీక్ష కేంద్రాల వద్ద చూపించాలి.
ఉదయం 9 గంటల నుంచి 9.30 గంటల వరకు పరీక్ష కేంద్రం లోపలికి అనుమతిస్తారు. 9.45 వరకు అభ్యర్థులను లోనికి అనుమతిస్తారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 1.30 వరకు పరీక్ష హాల్లోకి వెళ్లాలి. 15 నిమిషాల గ్రేస్ పీరియడ్ ఉంటుంది. అంటే మధ్యాహ్నం 1.45 తర్వాత ఎవరినీ అనుమతించరు. అభ్యర్థికి ఇచ్చే ఓఎమ్మార్ షీట్.. ఒరిజినల్, డూప్లికేట్ కాపీలుగా ఉంటుంది. పరీక్ష పూర్తయ్యాక అభ్యర్థి ఒరిజినల్ కాపీని ఇన్విజిలేటర్‌కు ఇచ్చి డూప్లికేట్ కాపీని తన వద్ద ఉంచుకోవాలి. ప్రాథమిక ‘కీ’ ను ఆదివారం రాత్రి లేదా సోమవారం విడుదల చేస్తారు.
కాగా.. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షా విధానంలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ప్రిలిమ్స్ తరహాలోనే మెయిన్స్ పరీక్ష కూడా నిర్వహించేలా నిర్ణయం తీసుకుంది. దీంతో మెయిన్స్ పరీక్షలోనూ మూడు పేపర్ల స్ధానంలో రెండు పేపర్లే ఉండనున్నాయి. ప్రిలిమినరీలో 150 మార్కులకు జనరల్ స్టడీస్ , మెంటల్ ఎబిలిటీ పరీక్ష ఉండగా.. మెయిన్స్ లో 450 మార్కులకు 3 పేపర్లకు బదులు ఇక నుంచి 300 మార్కులకు రెండు పేపర్లు మాత్రమే ఉంటాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..