Telangana: ములుగు జిల్లాలో దారుణం.. మహిళ ప్రాణం బలితీసుకున్న గుంత..
ములుగు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. భర్తతో కలిసి బైక్ పై వెళ్తున్న మహిళ జారీ పడింది. ఆస్పత్రికి తరలిస్తుండగానే మృతి చెందింది.
![Telangana: ములుగు జిల్లాలో దారుణం.. మహిళ ప్రాణం బలితీసుకున్న గుంత..](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/01/accident-7.jpg?w=1280)
ములుగు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. భర్తతో కలిసి బైక్ పై వెళ్తున్న మహిళ జారీ పడింది. ఆస్పత్రికి తరలిస్తుండగానే మృతి చెందింది. మృతురాలు వాజేడు మండలం మండపాక గ్రామానికి చెందిన సీత గా గుర్తించారు. ఈ ప్రమాదంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇసుక లారీల దాటికి మరో గిరిజన మహిళ బలైందంటూ ఆరోపించారు. నిత్యం వందల సంఖ్యలో అధిక లోడ్‌తో తిరిగే ఇసుక లారీల వల్లే వరుస ఘటనలు జరుగుతున్నాయంటూ ఫైర్ అయ్యారు స్థానికులు.
ఇసుక లారీలు పదేపదే తిరగడం వల్ల వెంకటాపురం-భద్రాచలం ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతినిందని చెప్పారు. దీంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని విమర్శించారు. ఇసుక లారీల రవాణాతో నిత్యనరకం అనుభవిస్తున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. వరుసగా జరుగుతున్న ఘటనలపై ఇప్పటికే అనేక సార్లు అధికారులకు కంప్లైంట్ చేసిన పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
కాంట్రాక్టర్ల దగ్గర లంచాలు తీసుకొని చూసి చూడనట్లు వదిలేస్తున్నారని మండిపడుతున్నారు స్థానికులు. ఇప్పటికైన ప్రభుత్వ అధికారులు పట్టించుకోని ప్రజల ప్రాణాలపాలిట శాపంగా మారిన ఇసుక లారీల రవాణాకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు ములుగు జిల్లా వాసులు.
![Image](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/01/do-not-store-petrol-in-vehicle.jpg)
![Image](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/01/burger.jpg)
![Image](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/01/sleeping-in-car.jpg)
![Image](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/01/why-men-and-women-shirts-button-up-on-different-sides.jpg)
మరిన్ని తెలంగాణ వార్తల కోస ఈ లింక్ క్లిక్ చేయండి..