Rajasthan: ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్త కన్నింగ్ ప్లాన్.. పోలీసులే షాక్..! వీడియో
సమాజంలో రోజు రోజుకీ విలువలు తగ్గిపోతున్నాయడానికి జరుగుతోన్న సంఘటనలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. డబ్బు కోసం కొందరు ఎంతటి దారుణానికైనా దిగజారుతున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ దారుణం అందరినీ షాకింగ్‌కు గురిచేసింది.
రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన షాలూ, మహేశ్ చంద్ భార్య భర్తలు. వీరికి ఓ కూతురు కూడా ఉంది. ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో షాలూ కొన్ని రోజులుగా పుట్టింట్లో ఉంటోంది. అయితే తమ మధ్య ఉన్న గొడవలు తొలగిపోవాలంటే 11 వారాల పాటు పూజా చేయాలని ఓ జ్యోతిష్యుడు చెప్పాడని భార్యను నమ్మించాడు మహేశ్. భర్త మాటలు నిజమని నమ్మిన షాలూ.. రోజు ఉదయం సోదరుడితో ఆలయానికి వెళ్తోంది. ఈక్రమంలోనే వెళ్తుండగా.. షాలూను ఓ బైక్ ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. తీవ్ర గాయాలైన సోదరుడు చికిత్స పొందుతున్నాడు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. మొదట ఇది ప్రమాదమేనని భావించిన పోలీసులకు ఇన్వెస్టిగేషన్‌లో షాకింగ్ విషయాలు తెలిశాయి. షాలూను భర్త మహేశ్ చంద్ హత్య చేయించినట్లు పోలీసుల విచారణలో తేలింది. పోలీసులు తమదైన స్టైల్‌లో అడగడంతో ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే ఇలా చేశానని ఒప్పుకున్నాడు. రౌడీ షీటర్ ముఖేశ్ సింగ్‌తో కలిసి ఆమె హత్యకు ప్లాన్ చేశాడు మహేశ్. లెక్కిస్తున్నాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Young man – father: యువకుడి తొందరపాటుకి.. పాపం తండ్రి బలి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

