Trending Video: షోరూం బయటి నుంచి టీవీ చూస్తున్న చిన్నారులు.. యజమాని ఏం చేశాడంటే.. గుండెల్ని పిండేస్తున్న వీడియో..
ప్రపంచం ఎంతో విశాలమైనది. కానీ అందులో నివసించే అందరి జీవితాలు ఒకేలా ఉండవు. పేదలు, ధనికులు, వ్యాపారవేత్తలు, మిలియనీర్స్, బిలియనీర్స్.. ఇలా వారి వారి ఆర్థిక స్థోమతను బట్టి జీవనం కొనసాగిస్తుంటారు. అయితే.....
ప్రపంచం ఎంతో విశాలమైనది. కానీ అందులో నివసించే అందరి జీవితాలు ఒకేలా ఉండవు. పేదలు, ధనికులు, వ్యాపారవేత్తలు, మిలియనీర్స్, బిలియనీర్స్.. ఇలా వారి వారి ఆర్థిక స్థోమతను బట్టి జీవనం కొనసాగిస్తుంటారు. అయితే.. ఎవరూ లేని వీధి బాలల పరిస్థితి ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా.. ఆ ఆలోచన వస్తేనే మనసు భారంగా అనిపిస్తుంది కదూ.. మనకే ఇలా ఉంటే.. ఇక వారి పరిస్థితిని ఊహించలేం. ఇంటర్నెట్ ప్రపంచంలో.. రోజూ ఎన్నో రకాల వీడియోలు కనిపిస్తాయి. వీటిని చూసిన తర్వాత కొన్ని నవ్వు తెప్పిస్తే.. మరికొన్ని బాధ కలిగిస్తాయి. ఇవి ఆధునిక సమాజంలో జరుగుతున్న మార్పులకు అద్దం పడుతాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఈ రోజుల్లో దుకాణదారులు నిరాశ్రయులు, బిచ్చగాళ్లను దుకాణాల ముందు నిలబడటానికి కూడా అనుమతించరు. ఎవరైనా ఇలా నిలబడితే వారిని అక్కడి నుంచి గెంటేస్తారు. ముఖ్యంగా పిల్లల విషయంలో చాలా దారుణంగా వ్యవహరిస్తారు.
ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఇద్దరు వీధి బాలలు ఓ ఎలక్ట్రానిక్ షోరూం బయట కూర్చుని ఉంటారు. ఆ షోరూం డిస్ప్లే లో ఎన్నో రకాల టీవీలు ఉంటాయి. వాటికి అడ్డుగా అద్దం ఉంటుంది. అయితే ఆ చిన్నారులకు షోరూమ్ లోపలకు వెళ్లేందుకు అనుమతించలేదు. దీంతో వారు చేసేదేమి లేక బయట కూర్చుని.. డిస్ప్లేలో ఉన్న టీవీ చూస్తారు. ఇంతలో ఓ సేల్స్ మాన్ బయటకు వచ్చి రిమోట్ లోంచి కార్టూన్ పెట్టాడు. దీంతో ఆ చిన్నారులు ఎంజాయ్ చేస్తూ.. కేరింతలు కొడుతూ టీవీ చూశారు.
Store incharge let’s homeless street kids choose what to watch on the display TV every evening. pic.twitter.com/ElOPGL61Fb
— Gautam Trivedi (@KaptanHindustan) January 5, 2023
ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్ లో పోస్ట్ అయింది. వార్త రాసే వరకు వీడియోకు లక్షల సంఖ్యలో వ్యూస్ వచ్చాయి. అంతే కాకుండా వీడియో చూసిన తర్వాత నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో రాస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..