చనిపోయిందని అంత్యక్రియలకు ఏర్పాట్లు.. చితిపై మారుస్తుండగా షాకింగ్ ఘటన.. భయంతో పరుగులు..
ఆమె చనిపోయిందని అందరూ భావించారు. పొంగుకొస్తున్న దుఃఖాన్ని దిగమింకుకుంటూ కుటుంబ సభ్యులు.. ఆమె అంత్యక్రియలు నిర్వహించేందుకు రెడీ అయ్యారు. సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం ఆఖరి క్రతువు...
ఆమె చనిపోయిందని అందరూ భావించారు. పొంగుకొస్తున్న దుఃఖాన్ని దిగమింకుకుంటూ కుటుంబ సభ్యులు.. ఆమె అంత్యక్రియలు నిర్వహించేందుకు రెడీ అయ్యారు. సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం ఆఖరి క్రతువు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మృతదేహాన్ని పాడె పై నుంచి.. చితి పైకి మారుస్తుండగా.. చనిపోయిందని భావించిన ఆమె ఒక్కసారిగా కళ్లు తెరిచింది. దీంతో కుటుంబసభ్యులందరూ తలోదిక్కూ పరిగెత్తారు. ఈ షాకింగ్ ఘటన ఉత్తర ప్రదేశ్ లో జరిగింది. ఫిరోజాబాద్ ప్రాంతానికి చెందిన హరిభేజికి 81 సంవత్సరాల వయసు. ఆమెకు తీవ్ర అనారోగ్యం కలగడంతో చికిత్స కోసం కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న హరిభేజికి ఈ నెల 3 న మెదడులో రక్తం గడ్డకట్టిందని, దీంతో ఆమె చనిపోయిందని వైద్యులు ధృవీకరించారు.
దాంతో కుటుంబ సభ్యులు ఆమె మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. హరిభేజిని కడసారి చూసి వీడ్కోలు పలికేందుకు బంధువులు అందరూ వచ్చారు. సంప్రదాయం ప్రకారం జరగాల్సిన క్రతువును పూర్తిచేసి పాడెపై ఆమె మృతదేహాన్ని స్మశాన వాటికకు తరలించారు. స్మశాన వాటికకు చేరిన తర్వాత పాడెపై నుంచి చితిపైకి మృతదేహాన్ని మారుస్తుండగా హరిభేజి ఒక్కసారిగా కళ్లు తెరిచింది. దాంతో అంత్యక్రియలకు హాజరైన బంధుమిత్రులు షాక్ గురయ్యారు. ఆ తర్వాత కాసేపటికే తేరుకుని వృద్ధురాలిని సంతోషంగా ఇంటికి తీసుకెళ్లారు.
అయితే.. మరుసటిరోజే హరిభేజీ అనారోగ్యంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. దాంతో బుధవారం మరోసారి బంధుమిత్రులకు సమాచారం ఇచ్చి హరిభేజి అంత్యక్రియలు నిర్వహించారు. హరిభేజి కుమారుడు సుగ్రీవ్ సింగ్ ఆమె చితికి నిప్పటించాడు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..