IND vs SL: బ్యాట్‌తో చెలరేగిన సూర్యకుమార్.. రాజ్‌కోట్‌ టీ20లో టీమిండియా గ్రాండ్ విక్టరీ.. సిరీస్‌ కైవసం

IND vs SL: భారత బ్యాట్స్‌మెన్‌ సూర్యకుమార్ యాదవ్‌ బ్యాట్‌తో అర్షదీప్‌ బాల్‌తో చెలరేగడం రాజ్‌కోట్‌ వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో భారత్‌ 91 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో టీ20 సిరీస్‌ను భారత్‌ 2-1తో కైవసం..

IND vs SL: బ్యాట్‌తో చెలరేగిన సూర్యకుమార్.. రాజ్‌కోట్‌ టీ20లో టీమిండియా గ్రాండ్ విక్టరీ.. సిరీస్‌ కైవసం
India Cricket Team
Follow us
Amarnadh Daneti

|

Updated on: Jan 08, 2023 | 4:36 AM

భారత బ్యాట్స్‌మెన్‌ సూర్యకుమార్ యాదవ్‌ బ్యాట్‌తో అర్షదీప్‌ బాల్‌తో చెలరేగడం రాజ్‌కోట్‌ వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో భారత్‌ 91 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో టీ20 సిరీస్‌ను భారత్‌ 2-1తో కైవసం చేసుకుంది. మొదటి టీ20లో విజయం సాధించిన భారత్‌, రెండో మ్యాచ్ ఓడిపోయింది. దీంతో మూడో టీ20 మ్యాచ్‌ ఆసక్తిని రెకెత్తించింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. సూర్యకుమార్‌ యాదవ్‌ 51 బంతుల్లో 112 పరుగులు చేసి సెంచరీతో చెలరేగడంతో భారత్‌ సునాయసంగా విజయం సాధించింది. 229 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక.. భారత బౌలర్ల ధాటికి 137 పరుగులకే ఆలౌటైంది. దీంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ని భారత్‌ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. లంక బ్యాటర్లలో శానక 23 పరుగులు చేయగా, ధనంజయ 22, అసలంక 19 పరుగులు మాత్రమే చేశారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్‌ సింగ్‌ 3, హార్దిక్ పాండ్యా 2, ఉమ్రాన్‌ మాలిక్ 2, చాహల్ 2, అక్షర్‌ పటేల్ 1 వికెట్ తీసుకున్నారు.

తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోరు సాధించింది. సూర్య కుమార్‌ యాదవ్ 51 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్స్‌లతో 112 పరుగులు చేశాడు. శుభ్‌మన్‌ గిల్ 46 పరుగులు, రాహుల్‌ త్రిపాఠి 35 పరుగులు, అక్షర్‌ పటేల్ 21 పరుగులతో రాణించారు. లంక బౌలర్లలో మదుశంక రెండు.. రజితా, కరుణరత్నె, హసరంగ తలో వికెట్ తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడావార్తల కోసం  చూడండి..

భారత్‌-జర్మనీ మధ్య సుస్థిర అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌..!
భారత్‌-జర్మనీ మధ్య సుస్థిర అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌..!
రాజకీయాలకు పోసాని గుడ్‌బై.. ఇకపై ఆఖరి శ్వాస వరకు..
రాజకీయాలకు పోసాని గుడ్‌బై.. ఇకపై ఆఖరి శ్వాస వరకు..
పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది
పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది
మనబొమ్మ అదుర్స్.. బాలీవుడ్‌ బెదుర్స్.! ఫిల్మ్ ఇండస్ట్రీ పై టాలీవు
మనబొమ్మ అదుర్స్.. బాలీవుడ్‌ బెదుర్స్.! ఫిల్మ్ ఇండస్ట్రీ పై టాలీవు
మీ రివ్యూ మీ ఇష్టమైతే.. మా సినిమా మా ఇష్టం.! రివ్యూవర్స్‌పై
మీ రివ్యూ మీ ఇష్టమైతే.. మా సినిమా మా ఇష్టం.! రివ్యూవర్స్‌పై
జక్కన్న సంగతి తెలిసిందేగా.. SSMB29 ఇప్పట్లో లేనట్లేనా.?
జక్కన్న సంగతి తెలిసిందేగా.. SSMB29 ఇప్పట్లో లేనట్లేనా.?
బన్నీ,సుకుమార్‌ దేవీశ్రీ ని పక్కన పెట్టేశారా? మధ్యలో తమన్ ఎందుకు?
బన్నీ,సుకుమార్‌ దేవీశ్రీ ని పక్కన పెట్టేశారా? మధ్యలో తమన్ ఎందుకు?
వామ్మో.. అనుష్క.! వయసు 43ఏళ్లే.. కానీ సంపాదన 140 కోట్లు.!
వామ్మో.. అనుష్క.! వయసు 43ఏళ్లే.. కానీ సంపాదన 140 కోట్లు.!
ఇండియాలోనే పరమ చెత్త సినిమా.. 45కోట్లు పెడితే 70 వేల కలెక్షన్స్‌.
ఇండియాలోనే పరమ చెత్త సినిమా.. 45కోట్లు పెడితే 70 వేల కలెక్షన్స్‌.
శివునికి నమస్కరిస్తూ కుప్పకూలిపోయిన వ్యక్తి... CPR చేసినా..
శివునికి నమస్కరిస్తూ కుప్పకూలిపోయిన వ్యక్తి... CPR చేసినా..