Women IPL 2023: మహిళా క్రికెటర్లకు గుడ్‌న్యూస్.. ఫిబ్రవరిలో ఐపీఎల్ వేలం.. ఆన్‌లైన్‌లో ఎంట్రీస్.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే?
మహిళల ఐపీఎల్ 2023 వేలం ఫిబ్రవరిలో జరగనుంది. ఇందుకోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆటగాళ్లు జనవరి 26 వరకు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. తొలిసారిగా మహిళల ఐపీఎల్ జరుగుతోంది.

Women IPL 2023: ఈ సంవత్సరం అన్ని ద్వైపాక్షిక సిరీస్‌లు, ఐసీసీ టోర్నమెంట్‌లతో పాటు తొలిసారి మహిళా ఐపీఎల్ (Women IPL 2023) కూడా జరగనుంది. కొత్త సంవత్సరం ప్రారంభం కావడంతో బీసీసీఐ కూడా భారీగానే ప్లాన్ చేసింది. బీసీసీఐ ఆటగాళ్లకు పంపిన లెటర్స్ ప్రకారం.. మహిళల ఐపీఎల్ తొలి సీజన్‌కు ఆటగాళ్లను వేలం ద్వారా జట్టును ఎంపిక చేస్తారు. ఈ మహిళల ఐపీఎల్‌కు సంబంధించి ఇంకా తేదీలు ప్రకటించలేదు. అలాగే పాల్గొనే ఫ్రాంచైజీల గురించి కూడా ఎలాంటి సమాచారం బయటకు రాలేదు.
క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం, ఫిబ్రవరి నెలలో మహిళల ఐపీఎల్ కోసం వేలం నిర్వహించవచ్చని తెలుస్తోంది. భారత ఆటగాళ్లకు పంపిన లేఖల్లో, ప్లేయర్ వేలంలో నమోదు చేయడానికి క్యాప్డ్, అన్‌క్యాప్డ్ క్రికెటర్లు ఆన్‌లైన్‌లో ఎంట్రీలను అందించాలని బీసీసీఐ కోరింది. దీనికి గడువు జనవరి 26 సాయంత్రం 5 గంటల వరకు నిర్ణయించింది.
క్యాప్డ్, అన్‌క్యాప్డ్ ప్లేయర్‌ల బేస్ ధరలు ఎలా ఉన్నాయంటే..
మహిళల ఐపీఎల్ కోసం జరిగిన వేలంలో క్యాప్డ్ ప్లేయర్ల బేస్ ధరను మూడు కేటగిరీలుగా విభజించారు. ఇందులో రూ. 50 లక్షలు, రూ.40 లక్షలు, రూ.30 లక్షలుగా నిర్ణయించారు. మరోవైపు అన్‌క్యాప్డ్ ఆటగాళ్ల బేస్ ధరను రూ.20 లక్షలు, రూ.10 లక్షలుగా ఉంచారు.




పోటీలో 5 ఫ్రాంచైజీలు..
ప్రస్తుత IPL ప్రోటోకాల్ ప్రకారం, వేలం జాబితాను సిద్ధం చేయడానికి వేలం రిజిస్టర్ నుంచి ఐదు ఫ్రాంచైజీలు షార్ట్‌లిస్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆపై వాటిని బిడ్డింగ్ కోసం ఉంచనున్నారు. వేలంలో అమ్ముడుకాని ‘రిజిస్టర్డ్ అవైలబుల్ ప్లేయర్స్ పూల్’లో ఉన్న ప్లేయర్‌లు ప్రత్యామ్నాయంగా ఎంపిక చేసుకోచ్చని పేర్కొంది.
జనవరి 16న మీడియా హక్కుల వేలం..
మహిళల ఐపీఎల్ మీడియా హక్కుల వేలాన్ని బీసీసీఐ కొద్ది రోజుల పాటు వాయిదా వేసింది. తాజాగా బీసీసీఐ జనవరి 16న ఈ వేలం నిర్వహించనున్నట్లు పేర్కొంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




