AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM MODI: అభివృద్ధి భారత్‌ నిర్మాణానికి ఆ నాలుగు అంశాలే కీలకం.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..

అభివృద్ధి భారత్‌ నిర్మాణం కోసం మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, ఆవిష్కరణ , ఇన్‌క్లూజన్‌ అనే నాలుగు స్తంభాలపై దృష్టి సారిస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఢిల్లీలో జ‌రిగిన రెండో ప్రభుత్వ ప్రధాన కార్య‌ద‌ర్శిల స‌మావేశంలో ఆయన ప్రసంగించారు. 2022 జూన్‌లో జరిగిన సదస్సు నుండి..

PM MODI: అభివృద్ధి భారత్‌ నిర్మాణానికి ఆ నాలుగు అంశాలే కీలకం.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..
Pm Modi
Amarnadh Daneti
| Edited By: |

Updated on: Jan 08, 2023 | 7:41 AM

Share

అభివృద్ధి భారత్‌ నిర్మాణం కోసం మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, ఆవిష్కరణ , ఇన్‌క్లూజన్‌ అనే నాలుగు స్తంభాలపై దృష్టి సారిస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఢిల్లీలో జ‌రిగిన రెండో ప్రభుత్వ ప్రధాన కార్య‌ద‌ర్శిల స‌మావేశంలో ఆయన ప్రసంగించారు. 2022 జూన్‌లో జరిగిన సదస్సు నుండి ఇప్పటివరకు దేశం సాధించిన అభివృద్ధి మైలురాళ్లను ప్రధాని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు, భారత్‌ G20 అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం, ప్రపంచంలోని ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడం, కొత్త స్టార్టప్‌ల వేగవంతమైన నమోదు, అంతరిక్ష రంగంలో ప్రైవేట్‌ సంస్థలకు అవకాశం వంటి విషయాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం కలిసి పనిచేసి ప్రగతి వేగాన్ని పెంచాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచించారు. నేడు ప్రపంచం మొత్తం భారత్‌పై విశ్వాసంతో ఉందని, ప్రపంచ సరఫరా గొలుసుకు స్థిరత్వాన్ని తీసుకురాగల దేశంగా భారత్‌ను చూస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి, వ్యాపార సౌలభ్యం, జీవన సౌలభ్యం, పటిష్టమైన మౌలిక సదుపాయాల కల్పనపై రాష్ట్రాలు దృష్టి సారించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు.

ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్‌ను ప్రధానమంత్రి ప్రారంభిస్తూ, ఆకాంక్షా జిల్లాల కార్యక్రమం కింద దేశంలోని వివిధ జిల్లాల్లో సాధించిన విజయాన్ని ప్రధాన మంత్రి గుర్తుచేశారు. ఆకాంక్ష జిల్లాల కార్యక్రమాన్ని క్షేత్రస్థాయికి విస్తరించి అభివృద్ధి చేయడానికి ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ రూపొందించినట్లు తెలిపారు. ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్‌ను ఆయా రాష్ట్రాల్లో అమలు చేయాలని సమావేశానికి హాజరైన అధికారులను ప్రధాని మోదీ కోరారు.

ఒకప్పుడు దేశం ఎదుర్కొన్న అధిక-నియంత్రణ, పరిమితుల భారాన్ని ప్రధాన మంత్రి గుర్తు చేసుకున్నారు. కేంద్ర, రాష్ట్ర స్థాయిలలో వేలకొద్దీ అనుసరణలను అంతం చేసేందుకు సంస్కరణలు అమలులోకి వచ్చాయని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కొన్ని చట్టాలు కొనసాగుతున్నాయని, పాత చట్టాలను అంతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..