- Telugu News Photo Gallery As per Experts these people should not eat too much of rajma or kidney beans
Rajma Side Effects: ఈ సమస్యలతో బాధపడేవారు రాజ్మాను పరిమితంగా తీసుకోవాలి.. లేదంటే పెను ప్రమాదమే..!
రజ్మా లేదా కిడ్నీ బీన్స్‌తో మన ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు చేకూరుతాయి. అయితే వీటిని పరిమితంగా తీసుకున్నంత కాలం మాత్రమే అలాంటి ప్రయోజనాలు ఉంటాయి. మితిమీరితే ఏదైనా మనకు, మన ఆరోగ్యానికి ఎంతో హాని చేస్తుంది. అదే రీతిలో అధికంగా ఈ కిడ్నీ బీన్స్‌ను తీసుకోవడం కూడా మన ఆరోగ్యానికి మంచిది కాదు.
Updated on: Jan 09, 2023 | 2:07 PM

రజ్మా లేదా కిడ్నీ బీన్స్‌తో మన ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు చేకూరుతాయి. అయితే వీటిని పరిమితంగా తీసుకున్నంత కాలం మాత్రమే అలాంటి ప్రయోజనాలు ఉంటాయి. మితిమీరితే ఏదైనా మనకు, మన ఆరోగ్యానికి ఎంతో హాని చేస్తుంది. అదే రీతిలో అధికంగా ఈ కిడ్నీ బీన్స్‌ను తీసుకోవడం కూడా మన ఆరోగ్యానికి మంచిది కాదు. ఆ క్రమంలోనే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు కిడ్నీ బీన్స్‌కు దూరంగా ఉండడం మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. వాటి వివరాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

మలబద్దకం: కిడ్నీ బీన్స్ తిన్న తర్వాత, అది జీర్ణం కావడానికి శరీరంలో నీటి పరిమాణం ఎక్కువగా ఉండాలి. మీరు తక్కువ నీరు త్రాగితే అది మలబద్ధకం సమస్యగా ఉన్నట్లయితే, రజమ్ తక్కువగా తినండి.

అదనపు ఐరన్: కిడ్నీ బీన్స్‌లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. దీనిని అధికంగా తీసుకుంటే.. శరీరంలో ఐరన్ స్థాయిని పెంచుతుంది. అది ఇతర అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. శరీరంలో ఐరన్ పుష్కలంగా ఉన్న వారు పరిమిత పరిమాణంలో కిడ్నీ బీన్స్ తక్కువగా తినాలి.

ప్రెగ్నెన్సీ: గర్భధారణ సమయంలో డ్నీ బీన్స్ తీసుకోవడం వల్ల తల్లికి, పుట్టబోయే బిడ్డకు ఇద్దరికీ మేలు జరుగుతుంది. అయితే దీన్ని అధికంగా తినడం వల్ల ఆరోగ్య పరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. గర్భిణీకి కడుపులో గ్యాస్ సమస్య వస్తుంది.

తక్కువ బరువు: తక్కవు బరువు ఉన్నవారు కూడా కిడ్నీ బీన్స్‌ను మితంగా తినాలి. ఇందులో పీచుపదార్థాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని ఎక్కువగా తింటే పొట్ట నిండినట్లుగా ఉంటుంది. ఆకలి అనిపించదు. దాంతో బరువు పెరుగలేరు.

పొట్ట సంబంధిత సమస్యలు: పొట్ట సంబంధిత సమస్యలు ఉన్నవారు కిడ్నీ బీన్స్ ఎక్కువగా తీసుకోవడం మానేయాలి. ఫైబర్ అధికంగా ఉండే కిడ్నీ బీన్స్ తినడం వల్ల జీర్ణవ్యవస్థ మరింత దిగజారుతుంది. కడుపులో తిమ్మిర్లు, నొప్పికి కారణం అవుతుంది.





























