- Telugu News Photo Gallery Technology photos According latest buzz oneplus going to launch new tablet india Telugu Tech News
OnePlus Tablet: గ్యాడ్జెట్ లవర్స్ గెట్ రడీ… వన్‌ప్లస్ నుంచి ట్యాబ్లెట్ వచ్చేస్తోంది. ధర తక్కువేనండోయ్..
ఇప్పటి వరకు స్మార్ట్ ఫోన్స్, టీవీలకు పెట్టింది పేరైన వన్‌ప్లస్ నుంచి ట్యాబ్లెట్స్ రానున్నాయి. త్వరలోనే వన్‌ప్లస్ భారత్‌లో ట్యాబ్లెట్‌ను లాంచ్ చేయనున్నాయని తెలుస్తోంది. ఇంతకీ వన్‌ప్లస్ ట్యాబ్లెట్ ధర ఎంత.? ఫీచర్లు ఎలా ఉండనున్నాయంటే..
Updated on: Jan 09, 2023 | 1:39 PM

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రాన్ దిగ్గజం వన్‌ప్లస్ త్వరలోనే భారత మార్కెట్లోకి ట్యాబ్లెట్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. ఇప్పటి వరకు స్మార్ట్‌ఫోన్, స్మార్ట్‌టీవలతో బలమైన మార్కెట్‌ను ఏర్పర్చుకున్న వన్‌ప్లస్ తాజాగా ట్యాబ్లెట్స్ తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలు పెట్టింది.

ఈ ఏడాది మధ్యలో వన్‌ప్లస్ ట్యాబ్లెట్ లాంచ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వన్‌ప్లస్ 11 ఆర్ స్మార్ట్ ఫోన్‌తో పాటు ఈ ట్యాబ్లెట్‌ను విడుదల చేయనున్నట్లు సమాచారం. వన్‌ప్లస్ ప్యాడ్ లేదా వన్‌ప్లస్ ట్యాబ్ పేరుతో తీసుకురానున్నట్లు సమాచారం.

ఇక ఇప్పటి వరకు తెలిసిన సమాచారం మేరకు వన్‌ప్లస్ ఈ ట్యాబ్లెట్‌ను బడ్జెట్ ధరలోనే లాంచ్ చేయనున్నట్లు సమాచారం. రూ. 20 వేలలోపు ఉండనున్నట్లు అంచనా వేస్తున్నారు.

ఇక ఫీచర్ల విషయానికొస్తే ఈ ట్యాబ్లెట్‌లో స్నాప్‍డ్రాగన్ 865 ప్రాసెసర్‌ను వన్‍ప్లస్ ట్యాబ్ కలిగి ఉంటుందని తెలుస్తోంది. 2K రెజల్యూషన్ ఉండే 10.36 ఇంచుల IPS LCD డిస్‍ప్లేతో రానుందని సమాచారం.

ఇక బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే 7100 ఎంఏహెచ్ బ్యాటరీ ఇవ్వనున్నారని సమాచారం. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు వన్‌ప్లస్ ఈ ఫీచర్లపై మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ రానుంది.





























