AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Painkiller Side Effects: పెయిన్ కిల్లర్స్‌తో ప్రయోజనాల కంటే దుష్ప్రభావాలే ఎక్కువ.. అవేమిటో తెలిస్తే షాక్ కావాల్సిందే..

ఆరోగ్య నిపుణుల ప్రకారం నొప్పి నివారణ మందులు నొప్పి నుంచి తక్షణ ఉపశమనాన్ని అందిస్తాయి. కానీ భవిష్యత్తులో అవి మన ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాలను చూపుతాయి. ఓవర్ ది కౌంటర్ డ్రగ్స్ (OTC)లో కనిపించే మందులను..

Painkiller Side Effects: పెయిన్ కిల్లర్స్‌తో ప్రయోజనాల కంటే దుష్ప్రభావాలే ఎక్కువ.. అవేమిటో తెలిస్తే షాక్ కావాల్సిందే..
Side Effects With Pain Killers
శివలీల గోపి తుల్వా
|

Updated on: Jan 09, 2023 | 12:06 PM

Share

చాలా మంది తమకు తలనొప్పి, కడుపు నొప్పి లేదా మరేదైనా నొప్పి వచ్చినప్పుడు వెంటనే డిస్ప్రిన్, కాంబిఫ్లామ్ లేదా బ్రూఫెన్ వంటి మందులను, పెయిన్ కిల్లర్ టాబ్లెట్లను తీసుకుంటారు. ఈ రకం టాబ్లెట్ల ఓవర్ డోసేజ్ దాని వల్ల కలిగే ప్రమాదాల గురించి వైద్యులు కూడా కొన్నిసార్లు ప్రస్తావిస్తుంటారు. ఆరోగ్య నిపుణుల ప్రకారం నొప్పి నివారణ మందులు నొప్పి నుంచి తక్షణ ఉపశమనాన్ని అందిస్తాయి. కానీ భవిష్యత్తులో అవి మన ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాలను చూపుతాయి. ఓవర్ ది కౌంటర్ డ్రగ్స్ (OTC)లో కనిపించే మందులను ప్రిస్క్రిప్షన్ లేకుండానే తీసుకోవచ్చు. వీటిని అరుదుగా వాడితేనే ఫలితాలు ఉంటాయి. అలా కాకుండా పదే పదే వాడినా, ఓవర్ డోస్ అయినా అనేక రకాల దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

డెన్మార్క్‌లోని కోపెన్‌హాగన్ యూనివర్శిటీ హాస్పిటల్ పరిశోధకులు ఇబుప్రోఫెన్‌ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల గుండెపోటు ఉన్నవారిలో మరణాల ప్రమాదం పెరుగుతుందని ఒక అధ్యయనంలో కనుగొన్నారు. ఈ ఔషధాన్ని తీసుకున్న తర్వాత అటువంటి రోగుల ప్రమాదం 59% వరకు పెరుగుతుందని తెలిపారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ అండ్ క్లినికల్ ఎక్సలెన్స్ ప్రకారం తలనొప్పికి పారాసెటమాల్, ఆస్పిరిన్, ఇబుప్రోఫెన్ వంటి నాన్-స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ వాడేవారికి తలనొప్పి మరింతగా వచ్చే అవకాశం ఉంది. ఈ మందులను ఎక్కువగా వాడే వారికి కాలక్రమేణా మైగ్రేన్ సమస్య వస్తుంది. ఇవే కాక అనేక రకాల దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. అవేబిటో ఇప్పుడు తెలుసుకుందాం..

  1. రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది: పెయిన్ కిల్లర్స్ మొదటిలో నొప్పి నుంచి ఉపశమనం కలిగించినప్పటికీ, తదనంతర కాలంలో మన శరీరంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. OxyContin వంటి నొప్పి నివారిణిలను దీర్ఘకాలికంగా ఉపయోగించడం వల్ల రోగనిరోధక వ్యవస్థసన్నగిల్లుతుంది. తద్వారా తరచూ ఆరోగ్య సమస్యలకు లోనయ్యే అవకాశం పెరుగుతుంది.
  2. కాలేయానికి హాని: మనం తీసుకునే కొన్ని రకాల మందులు కాలేయానికి హాని కలిగించవచ్చు. నొప్పి నివారణ మందులను ఎక్కువగా వాడినప్పుడు వీటిలోని విష పదార్థాలను మన కాలేయం కూడబెట్టుకుంటుంది. దీని వలన ప్రమాదకరంన, ప్రాణాంతంక పరిస్థితులు ఎదురవడమే కాక కాలేయం దెబ్బతింటుంది.
  3. ఇవి కూడా చదవండి
  4. గుండె సమస్యలు: కొంతమంది నొప్పి నుంచి త్వరగా ఉపశమనం పొందడానికి నొప్పి నివారణ మందులను ఎక్కువగా తీసుకుంటారు. కానీ ఇలా చేయడం ద్వారా ఔషధం నేరుగా రక్తంలోకి వెళుతుంది. అలా చేరిన ఔషధాలు గుండెపై కూడా ప్రభావం చూపుతాయి. ఇలా తరచూగా చేయడం వల్ల తీవ్రమైన గుండె సమస్యలు, గుండెపోటుకు దారితీస్తుంది.
  5. పేగు ఆరోగ్యం క్షీణిస్తుంది: కడుపు, పేగు సమస్యలు నొప్పి నివారణ మందులను తీసుకున్న తర్వాత ఒకటి లేదా రెండు రోజులకు సంభవించవచ్చు. నొప్పి నివారణ మందులను ఎక్కువగా తీసుకోవడం వల్ల మలబద్ధకం, ఉబ్బరం, అపానవాయువు, హేమోరాయిడ్లకు కారణమవుతుంది. ఎందుకంటే పెయిన్ రిలీవర్లు మన శరీరానికి జీర్ణం కావడం కష్టం.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..