Kidney Beans: రాజ్మాతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటో మీకు తెలుసా..? తెలిస్తే తినడానికి లొట్టలేయాల్సిందే..

మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కిడ్నీ బీన్స్‌లో ప్రోటీన్ అధిక మొత్తంలో ఉంటుంది. సాధారణంగా మనం తీసుకునే ఆహారపదార్థాల్లో మనకు పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ప్రోటీన్స్, ఖనిజాలు అధికంగా

Kidney Beans: రాజ్మాతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటో మీకు తెలుసా..? తెలిస్తే తినడానికి లొట్టలేయాల్సిందే..
Kidney Beans For Health
Follow us

|

Updated on: Jan 09, 2023 | 11:36 AM

రాజ్మా.. చాలా మందికి ఉన్న ఆహారపు అలవాట్లలో బాగంగా ఎంతో ఇష్టంగా తినే ఆహారం. వీటిని కిడ్నీ బీన్స్ (Rajma) అని కూడా అంటారు. ఎందుకంటే ఇది సరిగ్గా కిడ్నీ ఆకారాన్ని కలిగి ఉంటాయి. ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందించే ఈ కిడ్నీ బీన్స్‌లో ప్రోటీన్ అధిక మొత్తంలో ఉంటుంది. సాధారణంగా మనం తీసుకునే ఆహారపదార్థాల్లో మనకు పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ప్రోటీన్స్, ఖనిజాలు అధికంగా ఉండే ఆహార పదార్థాల్లో రాజ్మా ఒకటి. నలుపు, ముదురు ఎరుపు, లేత ఎరుపు రంగులలో లభించే రజ్మాతో మన ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. మనం రాజ్మాతో ఎన్నో రకాల రెసిపీస్‌ని కూడా తయారు చేసుకోవచ్చు. రాజ్మా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఐరన్, కాపర్, ఫోలేట్, మెగ్నీషియం, కాల్షియం, విటమిన్-సి వంటి పోషక పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి. రాజ్మాని తీసుకోవడం వలన ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను మనం పొందొచ్చు. అయితే మనం రాజ్మా తీసుకుంటే ఎటువంటి లాభాలను పొందవచ్చనేది ఇప్పుడు  తెలుసుకుందాం..

మధుమేహం నియంత్రణ: రాజ్మాని తీసుకోవడం వలన మధుమేహం తగ్గుతుంది. పైగా బరువు కూడా కంట్రోల్‌లో ఉంటుంది. క్యాన్సర్‌తో కూడా రాజ్మా పోరాడుతుంది.

ఫైబర్ నిధి: రాజ్మాలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీటిని తీసుకోవడం వలన శరీరానికి కావలసిన ఫైబర్ అధికంగా అందుతుంది.

ఇవి కూడా చదవండి

మెరుగైన జీర్ణవ్యవస్థ: రాజ్మా తీసుకోవడం వలన జీర్ణ వ్యవస్థ మెరుగుపడి, మలబద్ధకం వంటి సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు.

బరువు తగ్గడం: రాజ్మాని తీసుకోవడం వలన బరువు కూడా తగ్గవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వీటిలో ఉండే పలు రకాల లక్షణాలు ఈ ప్రక్రియలో సహాయపడతాయని చెబుతున్నారు.

చెడు కొలెస్ట్రాల్ నియంత్రణ: రాజ్మాని తినడం వలన చెడు కొలెస్ట్రాల్ తగ్గడమే కాక బీపీ కూడా స్థిరంగా ఉంటుంది. ఇందులో ఉండే మెగ్నీషియం రక్తపోటుని స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది.

హృదయ సంబంధిత సమస్యల నుంచి రక్షణ: రాజ్మాని తీసుకోవడం వలన హృదయ సంబంధిత సమస్యలకు దూరంగా ఉండేందుకు సాధ్యపడుతుంది. ఇందులో ఉండే మెగ్నీషియం, కాల్షియంతో మన ఎముకలు కూడా దృఢపడతాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..