Tirumala: శ్రీవారి భక్తులకు శుభవార్త.. జనవరి 12 నుంచి యథావిధిగా సర్వదర్శనాలు.. టిక్కెట్ల విడుదల ఎప్పుడంటే..
తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం( టీటీడీ) శుభవార్త తెలిపింది. ఈనెల 12నుంచి తిరుమలలో యథావిధిగా సర్వదర్శనాలు ప్రారంభం కానున్నాయని ఓ ప్రకటన ద్వారా ప్రకటించింది. ఈ నెల 2 నుంచి
తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం( టీటీడీ) శుభవార్త తెలిపింది. ఈనెల 12నుంచి తిరుమలలో యథావిధిగా సర్వదర్శనాలు ప్రారంభం కానున్నాయని ఓ ప్రకటన ద్వారా ప్రకటించింది. ఈ నెల 2 నుంచి 11వ తేదీ వరకు 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన సర్వదర్శన టోకెన్ల జారీ పూర్తయిందని పేర్కొన్న తితిదే.. 12 నుంచి సర్వదర్శనాలు పునరుద్ధరించనున్నట్లు ప్రకటించింది. ఈనెల 11తో వైకుంఠద్వార దర్శనాలు పూర్తి కానుండటంతో.. టీటీడీ అధికారులు తిరుపతిలో మూడుచోట్ల సర్వదర్శనం టికెట్లను ఇవ్వనున్నారు.
ఈ నేపథ్యంలో అలిపిరి భూదేవి కాంప్లెక్సు, శ్రీనివాసం, గోవిందరాజస్వామి రెండో సత్రం వద్ద సర్వదర్శన టికెట్లను జారీ చేయనున్నారు. ఇదే క్రమంలో జనవరి 12నుంచి ఫిబ్రవరి చివరాఖరు వరకు మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయబోతున్నారు.
కాగా, జనవరి, ఫిబ్రవరిలో శ్రీవారిని దర్శనం చేసుకోవాలనుకునేవాళ్లకు ఇది నిజంగానే శుభవార్త అని భక్తులు అనందం వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలలకు సంబంధించిన కోటాను టీటీడీ ఈ రోజు(జనవరి 9) విడుదల చేయబోతుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..