Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Relationship Tips: అన్యోన్య దాంపత్యం కోసం భార్యభర్తలు తప్పక తెలుసుకోవలసిన విషయాలివే.. అవేంటంటే..

భార్యభర్తల మధ్య గొడవలు రావడమనేది సర్వసాధారణమైన విషయం. అలా అని పదేపదే గొడవ పడితే మొదటికే మోసం జరుగుతుంది. ఇద్దరి మధ్య అర్థం చేసుకునే స్వభావం ఉండడం ఎంతో మంచిది. ముఖ్యంగా ఒకరినొకరు గౌరవించుకోవాలి. సమస్య ఉంటే కూర్చొని పరిష్కరించుకోవాలి. అలా కాకుండా..

Relationship Tips: అన్యోన్య దాంపత్యం కోసం భార్యభర్తలు తప్పక తెలుసుకోవలసిన విషయాలివే.. అవేంటంటే..
ఆహారం, సెక్స్ మానవ జీవితంలో అత్యంత ముఖ్యమైనవి.. లైంగిక జీవితాన్ని ఆహ్లాదకరంగా మార్చుకోవాలంటే కొన్ని ఆహార పానీయాలను తీసుకోవాలి. ఇవి, మహిళలు, పురుషుల్లో కామోద్దీపనలు- లైంగిక కోరికలను పెంచడంతోపాటు సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jan 07, 2023 | 10:35 AM

భార్యభర్తల మధ్య గొడవలు రావడమనేది సర్వసాధారణమైన విషయం. అలా అని పదేపదే గొడవ పడితే మొదటికే మోసం జరుగుతుంది. ఇద్దరి మధ్య అర్థం చేసుకునే స్వభావం ఉండడం ఎంతో మంచిది. ముఖ్యంగా ఒకరినొకరు గౌరవించుకోవాలి. సమస్య ఉంటే కూర్చొని పరిష్కరించుకోవాలి. అలా కాకుండా పంతాలకు పోతే విడాకులు తీసుకునేవరకు వెళుతుంది. అయితే పెళ్లయిన కొత్తలో చాలా మంది భార్యభర్తలు సిగ్గుతో ఉంటారు. జీవిత భాగస్వామి దగ్గర సరిగా మాట్లాడటానికి సంకోచిస్తారు. ఎందుకంటే అప్పటి వరకు వారిద్దరికి పరిచయం లేదు కనుక. ఇద్దరి మనసులు కలవాలంటే వారు మనసు విప్పి మాట్లాడుకోవాలి. మొదటి రోజు నుంచి ఒకరి గురించి మరొకరు అర్థం చేసుకోవాలి. అప్పుడే వారి దాంపత్యం పదికాలాల పాటు విరాజిల్లుతుంది. కాపురం చేసే క్రమంలో ఇద్దరికి మంచి సంబంధం కలుగుతుంది. కానీ కొత్తలో మాత్రం ఎడమొహం పెడమొహంగా ఉంటారు. ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధం పెరగాలంటే వారి మనసులు కలవాలి. అభిప్రాయాలు పంచుకోవాలి. అప్పుడే ఇద్దరి మధ్య బంధం మరింత బలపడుతుంది.

కొత్తగా పెళ్లి చేసుకున్నప్పుడు అందరు కొంచెం భయపడుతుంటారు. జీవిత భాగస్వామి ఎటువంటి వాడో అని భార్య, తన భార్య ఎలాంటిదో అనే అనుమానం భర్తకు కలగడం సహజమే. మాటలు కలిస్తే మనసు గురించి తెలుస్తుంది.  కాలక్రమంలో ఒకరికొకరు మాట్లాడుకుంటుంటే వారి గుణం బోధపడుతుంది. భర్తలోని మంచి గుణాలను తెలుసుకుంటుంది భార్య. భర్త కూడా తన భార్య తన కోసం ఏం చేస్తుందని ఎప్పుడు ఆలోచిస్తుంటాడు. ఇలా ఇద్దరి మధ్య అనుబంధం పెరగాలంటే వారికి ఏకాంతం కావాల్సిందే. భార్యాభర్తలు ఇద్దరు ఒకరికొకరు అర్థం చేసుకోవాలి. ఏకాంతంగా ఉన్న సమయంలో అభిప్రాయాలు పంచుకోవాలి. అనుబంధాలు పెంచుకోవాలి. ఆత్మీయత కలబోసుకోవాలి. అప్పుడే ఇద్దరి మధ్య అరమరికలు లేని విధంగా నడుచుకోవడానికి అంగీకారం కుదురుతుంది. ఒకరి కోరికలను మరొకరు తీర్చాలి. ఒకరి అవసరాలకు మరొకరు ప్రాధాన్యం ఇవ్వాలి. ఇలా చేస్తే సంసారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కలతలు లేని విధంగా ముందుకు సాగుతుంది. అన్యోన్య దాంపత్యానికి చిరునామాగా నిలుస్తారు. ఆదర్శప్రాయంగా జీవిస్తారు.

ఏదైనా మంచి పని చేసినప్పుడు ప్రశంసలతో ముంచెత్తాలి. జీవిత భాగస్వామి గురించి పొగడాలి. దీంతో ఇద్దరి మధ్య సమన్వయం మరింత పెరుగుతుంది. జీవిత భాగస్వామికి ఏం కావాలో చూసుకోవాలి. ఇద్దరి కోరికలు సమన్వయం చేసుకుని అవసరాలు పంచుకోవాలి. ఇద్దరు కలిసి తమ కాపురం ముందుకు తీసుకెళ్లేందుకు కష్టపడాలి. కుటుంబంలో తమ పాత్ర సమర్థవంతంగా నిర్వహించాలి. అప్పుడే మనకు ఓ గుర్తింపు లభిస్తుంది. ఇద్దరికి మంచి పేరు వస్తుంది. తద్వారా కుటుంబంలో కీలకం అయ్యే పరిస్థితులు కూడా ఉంటాయి. ఆలుమగలు స్నేహితులుగా ఉండాలి. మనకేదైనా అవసరం వస్తే స్నేహితులను ఎలా పంచుకుంటామో అలాగే భార్యాభర్తలు కూడా ఒకరి అవసరాలు మరొకరు తీరుస్తుండాలి. దీంతో ఇద్దరి మధ్య అపార్థాలు పొడచూపవు. అనుమానాలు కూడా తొలగిపోతాయి. భార్య కోసం భర్త చేసే ఏ పనైనా ఆమె అభినందిస్తుంది. దీంతో ఇద్దరు మంచి మార్గంలో సంసారంలో ముందుచూపుతో వ్యవహరించినట్లు అవుతుంది. దీని కోసం జీవితభాగస్వామితో మంచిగా మసలుకోవడమే మార్గంగా ఎంచుకోవాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..