Father – Child: ఛీ.. అసలు వీడు తండ్రేనా.. పసికందును ముళ్లపొదల్లో పడేసి.. వీడియో వైరల్..
కన్నతండ్రి వ్యామోహం.. ఆ పసికందును అనాథను చేసింది. తల్లిని పోగొట్టుకునేలా చేసి.. తన ప్రాణాల మీదకే తెచ్చింది. ఇదంతా తెలియని ఆ పసికందు ముళ్ల పొదల మాటున పడి ఏడుస్తుండటం అక్కడున్న వారిని కలచివేసింది.
కన్నతండ్రి వ్యామోహం.. ఆ పసికందును అనాథను చేసింది. తల్లిని పోగొట్టుకునేలా చేసి.. తన ప్రాణాల మీదకే తెచ్చింది. ఇదంతా తెలియని ఆ పసికందు ముళ్ల పొదల మాటున పడి ఏడుస్తుండటం అక్కడున్న వారిని కలచివేసింది. వారు వెంటనే అప్రమత్తమవడంతో శిశువు ప్రాణాలు దక్కాయి. తండ్రి కర్కశత్వానికి పసికందు ముళ్ల పొదల పాలైంది. ఎన్టీఆర్ జిల్లా కు చెందిన షాబాజ్ కు గుడివాడకు చెందిన ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా సహజీవనానికి దారి తీసింది. ఇద్దరూ హైదరాబాద్ లో ఉంటున్నారు. ఈ క్రమంలో మహిళ గర్భం దాల్చింది. నెలలు నిండడంతో 23వ తేదీ పురిటి నొప్పులు వచ్చాయి. చికిత్స అందించేందుకు ఆమెను హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో చేర్పించారు. అయితే.. ప్రసవం సమయంలో ఫిట్స్ రావడంతో దివ్య మృతి చెందింది. అంబులెన్స్ లో భార్య మృతదేహాన్ని, బిడ్డను గుడివాడ తీసుకెళుతూ పసికందును ఇబ్రహీంపట్నం మండలం దొనబండ వద్ద ముళ్లపొదల్లో పడేసి వెళ్లిపోయాడు షాబాజ్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos