Watch Video: స్మార్ట్ వర్క్.. తలపై బరువుతో రద్దీ రోడ్డుపై పట్టుకోకుండా సైకిల్ నడుపుతున్న దినసరి కూలి!
సైకిల్ హ్యాండిల్స్ పట్టుకోకుండా సైకిల్ నడపడగలరా? అస్సలు సాధ్యం కాదు.. హ్యాండిల్స్ పట్టుకోకుండా ఎవరైనా సైకిల్ తొక్కుతారా.. అని అనుకుంటున్నారా? ఐతే మీరు ఈ వీడియో చూడాల్సిందే..
సైకిల్ హ్యాండిల్స్ పట్టుకోకుండా సైకిల్ నడపడగలరా? అస్సలు సాధ్యం కాదు.. హ్యాండిల్స్ పట్టుకోకుండా ఎవరైనా సైకిల్ తొక్కుతారా.. అని అనుకుంటున్నారా? ఐతే మీరు ఈ వీడియో చూడాల్సిందే.. ఓ వ్యక్తి రద్దీగా ఉన్న నడి రోడ్డుపై సైకిల్ యమ స్పీడ్‌తో తొక్కడం వీడియో కనిపిస్తుంది. ఐతే చేతులు మాత్రం ముందున్న హ్యాండిల్స్ మీద కాకుండా తలపై ఉన్నాయి. అవును.. అతని తలపై ఎంతో బరువుతన్న రేకులు, ఇనుప రాడ్లు ఉన్నాయి మరి. రెండు చేతులతో తలపై ఉన్న బరువును పట్టుకుని, ఎంతో ఆత్మవిశ్వసంతో నడి రోడ్డులో ఎటువంటి అదురు బెదురు లేకుండా సైకిల్ నడుపుతున్న సదరు వ్యక్తిని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఆరిఫ్ షేక్ అనే ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) ఆఫీసర్ ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. ‘ఏమున్నాలేకున్నా ఆత్మవిశ్వాసం ఉంటే లైఫ్ ఇలాగే బ్యాలెన్స్‌గా ఉంటుందనే’ క్యాప్షన్‌ను ఈ వీడియోకు జోడించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
‘దీనిని కాన్ఫిడెన్స్ అని నేననుకోవడం లేదు. ప్రాక్టిస్ చేయడం వల్ల బ్యాలెన్స్‌గా సైకిల్ నడుపుతున్నాడని’ ఒకరు, ‘అతను బ్రేక్ ఎలా వేస్తాడో చూడాలని ఉంది’ అని మరొకరు కామెంట్ సెక్షన్‌లో పేర్కొన్నారు. ‘అతని సైకిల్ రైడింగ్ చూసి ఆనందపడుతున్నారు. బతుకు తెరువు కోసం జీవితాన్ని పణంగా పెట్టి పోరాడటం విచారకరం’ అని ఓ వినియోగదారుడు ఆందోళన వ్యక్తం చేశాడు. ‘ఇలాంటివి చూడటానికి బాగుంటాయి కానీ రియల్ లైఫ్‌లో ప్రాక్టీస్ చేస్తే థ్రిల్‌కు బదులు ప్రమదాలే ఎక్కువ జరుగుతాయని’ పలువురు హితబోధ చేస్తున్నారు.
और कुछ मिले ना मिले…life में बस इतना confidence मिल जाए… pic.twitter.com/bI6HcnuB1z
— Arif Shaikh IPS (@arifhs1) January 7, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.