Rare birds: పాలరాపుగుట్టపై అరుదైన పక్షులు.. మూడేళ్ల తర్వాత ఆగమనం..! కనువిందు చేస్తున్న వీడియో..
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాకు అరుదైన పక్షులు వచ్చాయి. మూడేళ్ల తర్వాత అవి తిరిగి వస్తుండటం తో పక్షి ప్రేమికులు మురిసిపోతున్నారు. పచ్చని చిక్కని అడవులు..ఆ అడవుల్లో విహరించే వన్యప్రాణులు..
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాకు అరుదైన పక్షులు వచ్చాయి. మూడేళ్ల తర్వాత అవి తిరిగి వస్తుండటం తో పక్షి ప్రేమికులు మురిసిపోతున్నారు. పచ్చని చిక్కని అడవులు..ఆ అడవుల్లో విహరించే వన్యప్రాణులు..పక్షుల కిల కిల రాగాలు. ఇలా ఎన్నెన్నో ప్రకృతి రమణీయతలను కలిగి ఉంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. ఇక్కడి అడవుల్లో ఎన్నో రకాల పక్షులు కనువిందు చేస్తుంటాయి. కొన్ని సీజన్లలో రకరకాల వలస పక్షులు ఈ ప్రాంతానికి వచ్చిపోతూ సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఈ నేపథ్యంలో అరుదైన పక్షుల ఆగమనం మరింత ఆనందాన్నికలిగిస్తోంది. మూడు సంవత్సరాల తర్వాత మళ్లీ కనిపించిన ఆ అరుదైన పక్షులు రాబందులు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ అటవీ డివిజన్ పరిధిలోని పెంచికల్ పేట్ రేంజ్ లోని నందిగాం పాలరాపుగుట్టకు తిరిగి రాబందులు వస్తున్నాయి. పెద్దవాగు, ప్రాణహిత నదులు కలిసే చోట దాదాపు 300 మీటర్ల ఎత్తులో ఉన్న పాలరాపు గుట్టపై తొమ్మిది పొడవు ముక్కు రాబందులు కనిపించాయి. 2013వ సంవత్సరంలో వీటిని గమనించిన అటవీ అధికారులు వాటి సంరక్షణకు చర్యలు ప్రారంభించారు. ఇందులో భాగంగానే వాటికి కావాల్సిన ఆహారం, ఇతర ఏర్పాట్లను సిద్ధం చేశారు. ఇతర వన్యప్రాణులు పాలరాపు గుట్టవైపు వెళ్లకుండా చుట్టూ సుమారు రెండు హెక్టార్ల విస్తీర్ణంలో ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేశారు. వాటి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ అసవరమైన రక్షణ చర్యలు చేపట్టేందుకు ఇద్దరు బర్డ్ వాచర్లతో పాటు ఒక బయోలజిస్టును నియమించారు. ఇక మిగతా రాబందులు కూడా ఒక్కొక్కటి తిరిగి వచ్చే అవకాశం ఉందని అటవీ అధికారులు భావిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం

