Self balancing e-bike: స్టాండ్ అవసరమే లేని ఈ-బైక్.. ప్రపంచలోనే మొట్టమొదటిది ఇదే..ఫీచర్స్ ఇవే
దీనిని సుసాధ్యం చేసి చూపించారు లైగర్ మోబిలిటీ సంస్థ వారు. ఎటువంటి స్టాండ్ సపోర్టు లేకుండా నిలబడే ఎలక్ట్రిక్ బైక్ ను తయారు చేశారు. దీనికి సంబంధించిన మోడల్ ను వచ్చే ఆటో ఎక్స్ పో 2023 లో ప్రదర్శించనున్నట్లు ఆ కంపెనీ ప్రకటించింది.
ఏదైనా బైక్ ని పార్క్ చేయాలంటే ఆ బండికి సైడ్ స్టాండ్ లేదా.. సెంటర్ స్టాండ్ వేసి నిలబడతాం. ఈ రెండూ లేకుండా, ఏ సపోర్ట్ లేకుండా బండి నిలబడటం అసాధ్యం. అయితే దీనిని సుసాధ్యం చేసి చూపించారు లైగర్ మోబిలిటీ సంస్థ వారు. ఎటువంటి స్టాండ్ సపోర్టు లేకుండా నిలబడే ఎలక్ట్రిక్ బైక్ ను తయారు చేశారు. దీనికి సంబంధించిన మోడల్ ను వచ్చే ఆటో ఎక్స్ పో 2023 లో ప్రదర్శించనున్నట్లు ఆ కంపెనీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆ ఎలక్ట్రిక్ బైక్ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం..
2019లోనే ప్రకటన..
ముంబైకి చెందిన లైగర్ మోబిలిటీ సంస్థ 2019లోనే సెల్ఫ్ బ్యాలెన్సింగ్, సెల్ఫ్ పార్కింగ్ టెక్నాలజీతో కూడిన ఎలక్ట్రిక్ బైక్ కు సంబంధించిన టీజర్ ను విడుదల చేసింది. అది ప్రీ ప్రోడక్షన్ దశ. ఇప్పుడు ఈ మోడల్ బైక్ ను లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
మోడర్న్ ఫీచర్లు..
ఈ సెల్ఫ్ బ్యాలెన్సింగ్ లైగర్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. ఇది ఎటువంటి స్టాండ్ సపోర్టు లేకుండానే నిలబడుతుంది. ఎక్కడైనా పార్క్ చేసుకునేందుకు ఇది వెసులుబాటు కల్పిస్తుంది. ఈ బైక్ చూడటానికి క్లాసిక్ వెస్పా డిజైన్ లో కనిపిస్తుంది. దీనికి డెల్టా ఆకారంలో ఎల్ ఈడీ హెడ్ ల్యాంప్ ఉంటుంది. ఎల్ ఈడీ ఇండికేటర్స్, ఎల్ ఈడీ డిస్ ప్లే ఉంటుంది. సౌకర్యవంతమైన సీట్, టెలిస్కోపింగ్ సస్పెన్షన్ ఉంటుంది. ఏయే రంగుల్లో లభ్యమయ్యేది ఇంకా వెల్లడించలేదు. డిస్క్ బ్రేక్ ఉంది.
సరికొత్త అధ్యాయం..
బైక్ తయారీలో తమ సెల్ఫ్ బ్యాలెన్సింగ్ టెక్నాలజీ ఓ సరికొత్త అధ్యాయాన్ని నెలకొల్పుతోందని ఆ సంస్థ ప్రకటించుకుంది. వినియోగదారుల క్షేమకర ప్రయాణానికి, సౌకర్యానికి తాము పూర్తి భరోసా నిస్తామని చెప్పింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..