Electric Bike: ఈ ఎలక్ట్రిక్ బైక్ రేంజ్ చూస్తే నోరెళ్ల బెట్టాల్సిందే! పల్సర్, స్ప్లెండర్ ను మించి ఉందిగా..
ఇదే క్రమంలో హైదరాబాద్‌కు చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ప్యూర్ ఈవీ(PURE EV) కూడా మార్కెట్లో అనేక ద్విచక్ర వాహనాలను విడుదల చేసింది. గత ఏడాది ఓ ఎలక్ట్రిక్ బైక్‌ను విడుదల చేసింది. ఇది యువతను బాగా ఆకర్షిస్తోంది. చూడటానికి పల్సర్, స్ప్లెండర్ లుక్ లో కనిపిస్తోన్న ఈ బైక్ పేరు E Tryst 350.

ప్రస్తుతం అంతా ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ నడుస్తోంది. ఇంధన ధరలు భారీగా పెరుగుతుండటం.. పర్యావరణ పరిరక్షణ కోసం అంతర్జాతీయంగా అన్ని ప్రభుత్వాలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తుండటంతో మార్కెట్ లోకి పెద్ద సంఖ్యలో ఈ బైక్ లు వచ్చి చేరుతున్నాయి. మన దేశంలో కూడా ఇదే విధమైన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో దిగ్గజ కంపెనీలు మొదలు స్టార్టప్ లు సహా తమ ఎలక్ట్రిక్ ఉత్పత్తులను మార్కెట్ లోకి తీసుకొచ్చాయి. ఇదే క్రమంలో హైదరాబాద్‌కు చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ప్యూర్ ఈవీ(PURE EV) కూడా మార్కెట్లో అనేక ద్విచక్ర వాహనాలను విడుదల చేసింది. గత ఏడాది ఓ ఎలక్ట్రిక్ బైక్‌ను విడుదల చేసింది. ఇది యువతను బాగా ఆకర్షిస్తోంది. చూడటానికి పల్సర్, స్ప్లెండర్ లుక్ లో కనిపిస్తోన్న ఈ బైక్ పేరు E Tryst 350. దీని ప్రత్యేకతలు, ఫీచర్లు వంటివి ఇప్పుడు చూద్దాం..
సూపర్ స్పీడ్..
ప్యూర్ ఈవీ ETRYST 350 బైక్ 3.5kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 140 కి.మీల వరకు ప్రయాణించగలుగుతుంది. బైక్ గరిష్ట వేగం గంటకు 85 కిలోమీటర్లు. ఈ ఎలక్ట్రిక్ బైక్ లో మూడు డ్రైవింగ్ మోడ్‌లు ఉంటాయి. డ్రైవ్ మోడ్‌లో 60 కి.మీ, క్రాస్ ఓవర్ మోడ్‌లో 75 కి.మీ, థ్రిల్ మోడ్‌లో 85 కి.మీ వేగంతో దీన్ని నడపవచ్చు. ఇ-బైక్ కేవలం 04.4 సెకన్లలో 0 నుంచి 40 kmph వేగాన్ని.. 7.4 సెకన్లలో 0-60 kmph వేగాన్ని అందుకోగలదు. ఇది బ్యాటరీతో 5 సంవత్సరాల వారంటీతో వస్తుంది. బ్యాటరీ కేవలం 6 గంటల్లో ఇంట్లోనే పూర్తిగా ఛార్జ్ అవుతుంది.
ధర ఎంతంటే..
ETRYST 350 ప్రారంభ రూ.1,54,999 ఉంది. ఇది 3 రంగులలో అందుబాటులో ఉంది. బైక్‌కు ముందు, వెనుక డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి. బైక్‌లో రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంది. దీనిలో LED లైట్లు, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టవిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..