Gold Investment: బంగారంపై పెట్టుబడికి ఇది సరైన సమయమేనా? నిపుణులు చెబుతున్నది ఏంటి? ఈ ఫ్యాక్ట్స్ చెక్ చేయండి..

ఇటువంటి పరిస్థితుల్లో బంగారంపై పెట్టుబడులు పెట్టడం మంచిదేనా? దీర్ఘకాలికంగా ఎటువంటి ఇబ్బందులు రావచ్చు? లాభసాటిగా ఉండాలంటే ఏమి చేయాలి? నిపుణులు చెబుతున్న సూచనలు..

Gold Investment: బంగారంపై పెట్టుబడికి ఇది సరైన సమయమేనా? నిపుణులు చెబుతున్నది ఏంటి? ఈ ఫ్యాక్ట్స్ చెక్ చేయండి..
Gold Rate
Follow us
Madhu

| Edited By: Anil kumar poka

Updated on: Jan 09, 2023 | 1:50 PM

అంతర్జాతీయంగా బంగారం ధరలు ఏటికేడు పెరుగుతూనే ఉన్నాయి. గతేడాదిలో కూడా స్వల్పంగా పెరుగుదల కనిపించింది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా మాంద్యం భయాలు, భౌగోళిక, రాజకీయ అస్థిరతలు, అమెరికా డాలర్ మరింత బలం పుంజుకోవడం వంటివి ప్రభావం చూపాయి. ఇటువంటి పరిస్థితుల్లో బంగారంపై పెట్టుబడులు పెట్టడం మంచిదేనా? దీర్ఘకాలికంగా ఎటువంటి ఇబ్బందులు రావచ్చు? లాభసాటిగా ఉండాలంటే ఏమి చేయాలి? నిపుణులు చెబుతున్న సూచనలు మీకోసం..

పెరుగుతూనే ఉంది..

2022లో అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. గతేడాది ప్రారంభంలో లండన్ స్పాట్ మార్కెట్ లో ఒక ఔన్స్ బంగారం ధర 1829.88 డాలర్లు ఉండగా.. అది మార్చి లో రష్యా ఉక్రెయిన్పై మిలటరీ ఆపరేషన్ ప్రారంభించే సమయానికి 2,069.88 డాలర్లకు చేరింది. అలాగే యూఎస్ ఫెడరల్ రిజర్వ్ భారీగా పెంచిన రేట్లు కూడా ప్రభావం చూపాయి.

మన దేశంలో పరిస్థితి..

మన దేశానికి వచ్చే సరికి 2022లో బంగారం ధరలు ఆకాశాన్నంటాయి. కొత్త రికార్డులు సృష్టించాయి. దీనికి ప్రధాన కారణం యూఎస్ డాలర్ తో పోల్చితే రూపాయి విలువ బలహీనంగా ఉండటమే. 2022లో ప్రారంభంలో పది గ్రాముల బంగారం రూ.48,050 ఉండగా.. ఒకానొక సమయంలో అది దాదాపు రూ. 55,558 వరకూ వెళ్లింది. అయితే చివరికి రూ. 55017 వద్ద నిలిచింది. గత ఐదేళ్లలో బంగారు ధరలు 90 శాతం పెరగాయి.

ఇవి కూడా చదవండి

బంగారం ధరలు ప్రభావితం చేసేవి..

మన దేశంలో బంగారం ధరలను సాధారణంగా మన దగ్గర ఉన్న డిమాండ్, ఫారిన్ బెంచ్ మార్క్స్, మార్కెట్ ఒడిదొడుకుల కారణంగా తగ్గుతూ పెరుగుతూ ఉన్న రూపాయి విలువ, ప్రభుత్వ పాలసీలు ప్రభావం చూపుతాయి. గతేడాది రూపాయి విలువ చాలా బలహీనపడింది. ఆల్ టైం కనిష్టానికి చేరుకుంది. రష్యా, ఉక్రెయిన్ వార్, అత్యధిక క్రూడ్ ఆయిల్ ధరలు, సెంట్రల్ బ్యాంక్ పాలసీలు ప్రభావం దీనిపై ప్రభావం చూపాయి.

బంగారానికి పెరిగిన డిమాండ్..

మరోవైపు రూపాయి విలువ పడిపోయినప్పటికీ మన దేశంలో బంగారానికి గతేడాది భారీ డిమాండ్ ఏర్పడింది. కోవిడ్ సంక్షోభం నుంచి తేరుకున్న జనాలు పెద్ద ఎత్తున్న విహహాది శుభకార్యాలు ఎక్కువగా జరుపుకున్నారు. దీంతో భారీగా బంగారం కొనుగోళ్లు జరిగాయి.

పెట్టుబడి దారుల పరిస్థితి..

అంతర్జాతీయ మార్కెట్లు.. దేశీయ డిమాండ్ తదితర అంశాలను బట్టి బంగారంపై పెట్టుబడి పెట్టిన వారికి అత్యధిక లాభాలు తెచ్చిపెట్టాయి. 2003లో బంగారు ధర రూ. 6000 ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకూ ధర పెరుగుతూ ఉన్న క్రమంలో బంగారం వ్యాపారులు దాదాపు 800 శాతం లాభాలు గడించారు.

భవిష్యత్తు ఎలా ఉంటుంది..

ఈ ఏడాది కూడా బంగారం వ్యాపారులకు పాజిటివ్ సంకేతాలే ఉన్నాయి. అంతర్జాతీయ పరిస్థితులు బంగారం ధరను అంతగా పతనం అవనిచ్చే అవకాశం తక్కువని నిపుణులు చెబుతున్నారు. దేశీయంగా బంగారం ధరలు ఎంతోకొంత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. దీనికి మన రూపాయి విలువ బలహీనంగా ఉండటం కారణమని చెబుతున్నారు. దీని వల్ల ట్యాక్స్ ఎక్కువ కట్టాల్సి వస్తుందని వివరిస్తున్నారు. మొత్తం మీద బంగారంపై పెట్టుబడులు పెట్టాలనుకునే వారు వీటిని దృష్టిలో పెట్టుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..