AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Expressway: బడ్జెట్‌కు ముందు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. 2024 నాటికి పూర్తి

కేంద్ర బడ్జెట్ 2023 మరికొద్ది రోజుల్లో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. అయితే సాధారణ బడ్జెట్‌పై దేశ ప్రజలు భారీ అంచనాలతో ఉన్నారు. అలాగే, 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు..

Expressway: బడ్జెట్‌కు ముందు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. 2024 నాటికి పూర్తి
Nitin Gadkari
Follow us
Subhash Goud

|

Updated on: Jan 09, 2023 | 10:56 AM

కేంద్ర బడ్జెట్ 2023 మరికొద్ది రోజుల్లో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. అయితే సాధారణ బడ్జెట్‌పై దేశ ప్రజలు భారీ అంచనాలతో ఉన్నారు. అలాగే, 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఇదే చివరి పూర్తి బడ్జెట్. అదే సమయంలో 2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఈసారి బడ్జెట్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అయితే బడ్జెట్‌కు ముందు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రజలు దాని బహుమతిగా అందుకోబోతున్నారు.

వచ్చే ఏడాది నాటికి బెంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం కానుంది. బెంగళూరు-చెన్నై మధ్య దాదాపు 300 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణికులు తక్కువ సమయంలో చేరుకోగలుగుతారు. బెంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్‌వే నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని 2-3 గంటలు తగ్గిస్తుందని, వచ్చే ఏడాది నాటికి ఇది సిద్ధం అవుతుందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఇది ప్రజలకు చాలా ఉపశమనం కలిగించనుంది. దీని నిర్మాణం కారణంగా సుదీర్ఘ ప్రయాణాన్ని తక్కువ సమయంలో కవర్ చేయవచ్చు.

బెంగళూరు- చెన్నై ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణంలో ఉన్న 262 కిలోమీటర్ల కర్ణాటక సెక్షన్‌ను బెంగళూరు-చెన్నై గడ్కరీ పరిశీలించారు. రూ.9,000 కోట్ల ప్రాజెక్ట్‌లో 52 కిలోమీటర్ల గ్రీన్‌ఫీల్డ్ అలైన్‌మెంట్ కూడా భాగం. రూ.16,730 కోట్లతో కొత్త గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్ట్ – బెంగళూరు నుండి చెన్నై ఎక్స్‌ప్రెస్‌వే మార్చి 2024 నాటికి సిద్ధం అవుతుందని గడ్కరీ చెప్పారు. ఫిబ్రవరి 2023 నాటికి బెంగళూరు-మైసూరు హైవే ప్రాజెక్టును పూర్తి చేస్తామని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

బెంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్ వే ప్రత్యేకతలు

బెంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్‌వే గురించి చెప్పాలంటే, ఈ హైవే కర్ణాటకలో 106 కి.మీ, ఆంధ్రప్రదేశ్‌లో 71 కి.మీ, తమిళనాడులో 85 కి.మీ. ఇది బెంగళూరును కర్ణాటకలోని మలూరు, బంగారుపేట, కేజీఎఫ్, బేత్‌మంగళ వంటి నగరాలకు కలుపుతుంది. గంటకు 120 కి.మీ వేగంతో రూపొందించిన ఈ హైవే.. బెంగళూరు- చెన్నై మధ్య రహదారి దూరాన్ని 262 కి.మీ తగ్గిస్తుంది. ప్రస్తుత ప్రయాణ సమయాన్ని ఆరు గంటల నుండి 2.5 గంటలకు తగ్గిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి