AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gautam Adani: గౌతమ్ అదానీ ఇప్పటికీ దీని గురించి పశ్చాత్తాపపడతాడట.. అదేంటో తెలుసా..?

ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన గౌతమ్ అదానీ తన కాలేజీ చదువును పూర్తి చేయలేకపోయినందుకు ఇప్పటికీ పశ్చాత్తాపపడుతున్నాడు. 1978లో కేవలం 16 సంవత్సరాల వయస్సులో..

Gautam Adani: గౌతమ్ అదానీ ఇప్పటికీ దీని గురించి పశ్చాత్తాపపడతాడట.. అదేంటో తెలుసా..?
Gautam Adani
Subhash Goud
|

Updated on: Jan 09, 2023 | 8:30 AM

Share

ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన గౌతమ్ అదానీ తన కాలేజీ చదువును పూర్తి చేయలేకపోయినందుకు ఇప్పటికీ పశ్చాత్తాపపడుతున్నాడు. 1978లో కేవలం 16 సంవత్సరాల వయస్సులో అతను విద్యను మధ్యలోనే వదిలేసి, తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ముంబై వెళ్ళానని ఆదాని చెప్పుకొచ్చాడు. మూడు సంవత్సరాల తరువాత అతను వ్యాపారంలో తన మొదటి విజయాన్ని సాధించాడు. జపాన్ కొనుగోలుదారుకు వజ్రాలు అమ్మినందుకు కమీషన్‌గా రూ. 10,000 పొందాడు. దీంతో పారిశ్రామికవేత్తగా అదానీ ప్రయాణం మొదలై నేడు ప్రపంచంలోనే మూడో అత్యంత సంపన్న పారిశ్రామికవేత్తగా అవతరించారు. అయినా కాలేజీ చదువులు పూర్తి చేయలేకపోయినందుకు బాధపడుతుంటాడు. తొలి అనుభవాలు నన్ను మరింత జ్ఞానవంతం చేశాయని పేర్కొన్నారు. గుజరాత్‌లోని విద్యా మందిర్ ట్రస్ట్ పాలన్‌పూర్ 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అదానీ మాట్లాడారు. తొలి అనుభవాలు తనను జ్ఞానవంతం చేశాయన్నారు. కానీ అధికారిక విద్య జ్ఞానాన్ని వేగంగా విస్తరిస్తుంది. బనస్కాంతలో తన ప్రారంభ రోజుల తర్వాత అతను అహ్మదాబాద్‌కు వెళ్లాడు అక్కడ అతను తన మాధ్యమిక విద్యను పూర్తి చేయడానికి నాలుగు సంవత్సరాలు గడిపాడు.

తన చదువును వదిలి ముంబై వెళ్లాలని నిర్ణయించుకున్నప్పుడు తనకు 16 ఏళ్లు మాత్రమేనని చెప్పారు. ముంబైకి ఎందుకు వెళ్లాను, నా కుటుంబంతో కలిసి ఎందుకు పని చేయలేదని నన్ను తరచుగా ఒక ప్రశ్న అడుగుతారని అన్నారు. యుక్తవయసులో ఉన్న కుర్రాడి నిరీక్షణ, స్వాతంత్ర్య కోరికను కలిగి ఉండటం కష్టమని యువకులు అంగీకరిస్తారని అన్నారు. నాకు తెలిసిందల్లా ఒక్కటే నేను ఏదైనా విభిన్నంగా చేయాలనుకున్నాను.. నా స్వంతంగా చేయాలనుకున్నాను అని అన్నారు.

గౌతమ్ అదానీ రైలు టికెట్ కొని గుజరాత్ మెయిల్ ద్వారా ముంబైకి బయలుదేరినట్లు చెప్పారు. ముంబైలో మా కజిన్ ప్రకాష్‌భాయ్ దేశాయ్ నాకు మహేంద్ర బ్రదర్స్‌లో ఉద్యోగం ఇచ్చారు. అక్కడ నేను వజ్రాల వ్యాపారం గురించి తెలుసుకున్నానని అన్నారు.

ఇవి కూడా చదవండి

మహేంద్ర బ్రదర్స్‌తో సుమారు మూడు సంవత్సరాలు పనిచేసిన తర్వాత నేను జవేరీ బజార్‌లో నా స్వంత వజ్రాల బ్రోకరేజ్‌ని ప్రారంభించాను. జపనీస్ కొనుగోలుదారుతో తన మొదటి ఒప్పందంపై సంతకం చేసిన రోజు ఇప్పటికీ తనకు గుర్తుందని ఆదానీ చెప్పాడు. రూ.10వేలు కమీషన్ ఇచ్చాడు. వ్యాపారవేత్తగా అతని ప్రయాణానికి ఇది నాంది అంటూ వివరించారు. భారతదేశపు అతిపెద్ద విమానాశ్రయం, నౌకాశ్రయం అయిన అదానీ గ్రూప్ క్రింద ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పవర్ కంపెనీ. వ్యాపారం శక్తి నుండి సిమెంట్ పరిశ్రమ వరకు విస్తరించి ఉంది. సమూహం మార్కెట్ క్యాపిటలైజేషన్ US$ 225 బిలియన్లు. ఇదంతా గత నాలుగున్నర దశాబ్దాల్లో జరిగింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి