India Auto Market: వాహనాల అమ్మకాల్లో రికార్డ్‌ సృష్టించిన భారత్‌.. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద మార్కెట్‌!

2022 సంవత్సరంలో భారతదేశం భారీ రికార్డును సృష్టించింది. గత ఏడాదిలో జపాన్‌ను వెనక్కి నెట్టి భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్‌గా అవతరించింది..

India Auto Market: వాహనాల అమ్మకాల్లో రికార్డ్‌ సృష్టించిన భారత్‌.. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద మార్కెట్‌!
India Auto Market
Follow us

|

Updated on: Jan 08, 2023 | 12:07 PM

2022 సంవత్సరంలో భారతదేశం భారీ రికార్డును సృష్టించింది. గత ఏడాదిలో జపాన్‌ను వెనక్కి నెట్టి భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్‌గా అవతరించింది. ఇటీవల ఆటో మార్కెట్ ఇండస్ట్రీ ఇచ్చిన సమాచారం మేరకు.. 2022 సంవత్సరంలో భారతదేశంలో మొత్తం 42.5 లక్షల కొత్త వాహనాలు విక్రయించినట్లు తెలిసింది. జపాన్‌లో 2022లో మొత్తం 42 లక్షల యూనిట్ల వాహనాలు అమ్ముడయ్యాయి.

సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (SIAM) అందించిన సమాచారం ప్రకారం.. 2022 జనవరి నుండి నవంబర్ వరకు భారతదేశంలో మొత్తం 41.3 లక్షల వాహనాలు డెలివరీ అయ్యాయి. అదే సమయంలో, సంవత్సరం చివరి నాటికి ఈ సంఖ్య 42.50 లక్షలకు చేరుకుంది. దేశంలోనే అతిపెద్ద ఆటో రంగ సంస్థ మారుతీ సుజుకీ డిసెంబర్‌లో తమ వాహనాల విక్రయ గణాంకాలను విడుదల చేసింది. దీని తర్వాత భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆటో మార్కెట్‌గా అవతరించింది. ఇక తమ దేశంలో వాహనాల అమ్మకాలు తక్కువగా ఉన్నాయని జపాన్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ తెలిపింది. గత సంవత్సరం జపాన్‌లో మొత్తం 42 లక్షల వాహనాలు విక్రయించింది. ఇది 2021 సంవత్సరంతో పోలిస్తే 5.6 శాతం తక్కువ.

చైనా ప్రపంచంలోనే అతిపెద్ద ఆటో మార్కెట్

చైనా ప్రపంచంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్. 2021లో చైనాలో మొత్తం 2.62 కోట్ల వాహనాలు అమ్ముడయ్యాయి. 2021లో మొత్తం 1.54 కోట్ల వాహనాలు విక్రయించిన అమెరికా రెండో స్థానంలో ఉంది. కాగా 2021 సంవత్సరంలో జపాన్‌లో మొత్తం 44.4 లక్షల వాహనాలు అమ్ముడయ్యాయి. జపాన్ చాలా సంవత్సరాలుగా ఆసియాలో అతిపెద్ద ఆటో మార్కెట్‌గా ఉన్న విషయం తెలిసిందే. 2018 సంవత్సరంలో జపాన్‌లో మొత్తం 40.4 లక్షల వాహనాలు అమ్ముడయ్యాయి. కాగా 2019 సంవత్సరంలో మొత్తం 40 లక్షల వాహనాలు అమ్ముడయ్యాయి. 2020 సంవత్సరంలో కరోనా మహమ్మారి ఆటో రంగానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి