Amruta Fadnavis: మూడ్‌ బనాలియా అంటూ హుషారైన స్టెప్పులతో అదరగొట్టిన డిప్యూటీ సీఎం భార్య.. వీడియో వైరల్‌

అమృతా ఫ‌డ్నవీస్ షేర్‌ చేసిన ఈ పోస్ట్‌ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. క్షణాల్లోనే లక్షలాది వ్యూస్‌ వచ్చాయి. వేలాది మంది రీట్వీట్లు చేస్తున్నారు. మిసెస్‌ ఫడ్నవీస్‌ డ్యాన్స్‌ అద్భుతంగా ఉందంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Amruta Fadnavis: మూడ్‌ బనాలియా అంటూ హుషారైన స్టెప్పులతో అదరగొట్టిన డిప్యూటీ సీఎం భార్య.. వీడియో వైరల్‌
Devendra Fadnavis, Amruta
Follow us
Basha Shek

|

Updated on: Jan 09, 2023 | 7:07 PM

మ‌హారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ సతీమణి అమృతా ఫ‌డ్నవీస్ తన డ్యాన్స్‌ వీడియోతో సోషల్‌ మీడియాను షేక్‌ చేశారు. మూడ్ బ‌నాలియా పాట‌ను విడుదల చేసిన ఆమె ఇందుకోసం కొన్ని హుషారైన స్టెప్స్ కూడా వేశారు. అనంతరం తన డ్యాన్సింగ్ స్కిల్స్‌కు సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో షేర్ చేశారు. దీంతో పాటు ఒక ఛాలెంజ్ కూడా విసిరారు. ఆ పాట‌ను వాడుకుని ఓ రీల్ తీసి త‌మ‌కు హ్యాష్‌ట్యాగ్ చేయాల‌ని సామాజిక మాధ్యమాల వేదికగా కోరారామె. అమృతా ఫ‌డ్నవీస్ షేర్‌ చేసిన ఈ పోస్ట్‌ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. క్షణాల్లోనే లక్షలాది వ్యూస్‌ వచ్చాయి. వేలాది మంది రీట్వీట్లు చేస్తున్నారు. మిసెస్‌ ఫడ్నవీస్‌ డ్యాన్స్‌ అద్భుతంగా ఉందంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా మూడ్ బ‌నాలియా సాంగ్‌ను జ‌న‌వ‌రి 6వ తేదీన రిలీజ్ చేశారు. యూట్యూబ్‌లో రిలీజైన ఈ పాటకు ఇప్ప‌టివరకు 2.2 కోట్ల వ్యూస్‌ వ‌చ్చాయి. ఆర్టిస్ట్ మీట్ బ్రోస్‌, అమృతా ఫ‌డ్న‌వీస్ ఈ వీడియోను రూపొందించారు. ఐశ్వ‌ర్య త్రిపాఠి దీనికి సంగీతం అందించారు.

కాగా అమృత ఫడ్నవిస్ ఫైనాన్స్‌లో ఎంబీఏ చేశారు. 2003లో యాక్సిస్ బ్యాంక్‌లో ఎగ్జిక్యూటివ్ క్యాషియర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. 2005 డిసెంబర్‌లో దేవేంద్ర ఫడ్నవీస్‌తో కలిసి ఏడడుగులు నడిచారు. మల్టీపుల్‌ ట్యాలెంటెడ్ వుమెన్‌గా గుర్తింపు తెచ్చుకున్న అమృత మంచి గాయని కూడా. గతంలో ఆమె పాడిన వో తేరే ప్యార్ కా ఘమ్, శివ తాండవ్ శరతం, తేరీ మేరీ ఫిర్ సే, బేటియా వంటి పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..