- Telugu News Photo Gallery Cricket photos Surya Kumar Yadav Creates New World Records in T20 Internationals
IND vs SL: మనల్ని ఎవడ్రా ఆపేది? ఆకాశమే హద్దుగా చెలరేగుతోన్న సూర్య.. దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
శ్రీలంకతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ విజృంభించాడు. కేవలం 45 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. తద్వారా టీ20లో అత్యంత వేగంగా సెంచరీ సాధించిన రెండో టీమిండియా బ్యాటర్‌గా అరుదైన రికార్డు నెలకొల్పాడు.
Updated on: Jan 08, 2023 | 10:52 AM


గతంలో ఈ రికార్డు కేఎల్ రాహుల్ పేరిట ఉండేది. 2016లో వెస్టిండీస్‌పై కేఎల్ రాహుల్ 46 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఇప్పుడు కేవలం 45 బంతుల్లోనే సెంచరీ సాధించిన సూర్య.. టీ20 క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన భారతీయ క్రికెటర్ల జాబితాలో 2వ స్థానానికి చేరుకున్నాడు.

టీమిండియా తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన రికార్డు రోహిత్ శర్మ పేరు మీద ఉంది. 2017లో శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ కేవలం 35 బంతుల్లోనే సెంచరీ సాధించాడు.

ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ 51 బంతుల్లో అజేయంగా 112 పరుగులు చేయడం ద్వారా టీ20 క్రికెట్‌లో 1500 పరుగులు పూర్తి చేశాడు. అతను కేవలం 843 బంతుల్లోనే 1500 పరుగులు చేశాడు. తద్వారా టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా 1500 పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

భారత జట్టు తరఫున 3 టీ20 సెంచరీలు చేసిన 2వ బ్యాటర్ సూర్యనే. రోహిత్ శర్మ మొత్తం 4 టీ20 సెంచరీలు చేసి మొదటి స్థానంలో ఉన్నాడు. అంతేకాదు 2023లో టీమిండియా తరఫున సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌గా కూడా నిలిచాడు సూర్య. ఇక భారత్‌లో సూర్యకుమార్ యాదవ్‌కు ఇదే తొలి సెంచరీ కావడం విశేషం.




