Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heart Attack: అలెర్ట్.. శీతాకాలంలో పెరుగుతున్న గుండెపోటు మరణాలు.. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి..

ప్రస్తుత కాలంలో గుండెపోటు ప్రమాదం పెరుగుతోంది. భారతదేశంలో గుండెపోటు మరణాల సంఖ్య భారీగా పెరుగుతున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.

Heart Attack: అలెర్ట్.. శీతాకాలంలో పెరుగుతున్న గుండెపోటు మరణాలు.. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి..
Heart Attack
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 09, 2023 | 8:43 PM

ప్రస్తుత కాలంలో గుండెపోటు ప్రమాదం పెరుగుతోంది. భారతదేశంలో గుండెపోటు మరణాల సంఖ్య భారీగా పెరుగుతున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో గత ఐదు రోజుల్లో 98 మంది గుండె, బ్రెయిన్ స్ట్రోక్‌తో మరణించారని ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆరోగ్య ఫెటర్నిటీ తెలిపింది. గత రెండు రోజులుగా దట్టమైన పొగమంచు, చలి గాలులు ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలను చుట్టుముట్టాయి. చాలా రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గుముఖం పడుతున్నాయి. శీతల వాతావరణం వల్ల వ్యాధుల ప్రమాదం పెరుగుతోందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లో పొగమంచు, చలిగాలులు ఎక్కువగా ఉన్నాయి. చలిగాలులతో పాటు వచ్చే జబ్బులతో అక్కడి ప్రజలు పోరాడుతున్నారు. ముఖ్యంగా హృదయ సంబంధ వ్యాధులు పెరిగాయి. గత ఐదు రోజుల్లో 98 మంది గుండె, బ్రెయిన్ స్ట్రోక్, శ్వాసకోశ సమస్యలతో ఊపిరాడకుండా మరణించారని నివేదికలో తేలింది. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ హెల్త్ ఫెడరేషన్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ గణాంకాలను I.PS ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అందించింది.

శీతాకాలం గుండెపోటు, స్ట్రోక్‌కు ఎందుకు కారణమవుతుంది?

చలికాలంలో గుండెజబ్బులు సర్వసాధారణం. గుండె జబ్బులు స్ట్రోక్‌కు కారణమవుతాయి. చల్లని వాతావరణంలో గుండె వైఫల్యం లాంటి కేసులు వస్తుంటాయి. ఉష్ణోగ్రతలో అకస్మాత్తుగా తగ్గుదల కారణంగా, గుండె సంబంధిత మరణాలు పెరుగుతాయి. వైద్యుల ప్రకారం.. చల్లని వాతావరణం రక్తపోటును పెంచుతుంది. ఇది ఆకస్మిక గుండెపోటు, సెరిబ్రల్ పాల్సీ మొదలైన గుండె సంబంధిత వ్యాధులను ప్రేరేపిస్తుంది.

ఇవి కూడా చదవండి

బ్రెయిన్ స్ట్రోక్ సాధారణ లక్షణాలు

  • మాట్లాడేటప్పుడు గందరగోళం
  • దృష్టి సమస్యలు
  • ముఖం, చేయి లేదా కాలులో తిమ్మిరి లేదా బలహీనత
  • తీవ్రమైన తలనొప్పి

గుండెపోటు లక్షణాలు..

  • దీర్ఘకాలిక ఛాతీ నొప్పి
  • ఛాతీలో అసౌకర్యం
  • సరిగా శ్వాస తీసుకోలేకపోవడం
  • దవడ, మెడ, వీపు, చేయి లేదా భుజంలో నొప్పి లేదా అసౌకర్యం
  • వికారం
  • విపరీతమైన అలసట లాంటివి కనిపిస్తాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..