Ragi Benefits: అలాంటి వారికి దివ్యౌషధం ఫింగర్ మిల్లెట్స్.. రాగులను ఇలా తీసుకుంటే నమ్మలేనన్ని ప్రయోజనాలు..
రాగులలో ఎన్నో పోషకాలు దాగున్నాయి. అందుకే ఆరోగ్యానికి మేలు ఈ తృణ ధాన్యాలను ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
రాగులలో ఎన్నో పోషకాలు దాగున్నాయి. అందుకే ఆరోగ్యానికి మేలు ఈ తృణ ధాన్యాలను ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రాగులలో కొలెస్ట్రాల్, సోడియం లేవు.. దీంతో కొవ్వు 7 శాతం మాత్రమే ఉంటుంది. వీటితోపాటు.. కాల్షియం, విటమిన్లు, ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్లు లాంటివి రాగుల్లో పుష్కలంగా దాగున్నాయి. అందుకే స్థూలకాయానికి దారితీసే ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఎన్నో వ్యాధులు సంక్రమిస్తాయి. కానీ.. రాగులు వంటి తృణధాన్యాలు ఫిట్‌నెస్ తో పాటు బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడతాయి. ముఖ్యంగా చలికాలంలో రాగులను తినడం వల్ల వ్యాధులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. మధుమేహం, ఊబకాయం, రక్తహీనత వంటి వ్యాధులలో సైతం రాగులు మేలు చేస్తుంది. అందుకే రాగి పిండితో చేసిన వంటలు, రాగి జావ, రాగి రోటి వంటి వాటిని ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శీతాకాలంలో రాగులను ఎందుకు చేర్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
శీతాకాలపు ఆహారంలో రాగులను ఎందుకు చేర్చుకోవాలో తెలుసుకోండి..
- జీర్ణక్రియకు మంచిది: రాగి ఫైబర్ అధికంగా ఉండే ఆహారం. దీన్ని తీసుకోవడం ద్వారా అనేక జీర్ణ సమస్యలను పరిష్కరించుకోవచ్చు. రాగులు చాలా తేలికగా ఉంటాయి. కావున మీ కడుపు నొప్పి లేదా జీర్ణక్రియ సమస్యలుంటే రాగి ఆధారిత ఆహారాన్ని తీసుకోవచ్చు. ఇది జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. శక్తిని ఇస్తుంది. ఇంకా బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
- మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది: గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉన్నందున, రాగిని ప్రతిరోజూ తింటే మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఈ పోషకాలు మధుమేహం నిర్వహణలో కూడా సహాయపడతాయి. రాగిలో అధిక పాలీఫెనాల్, డైటరీ ఫైబర్ కంటెంట్ ఉంటుంది. దీనిని క్రమం తప్పకుండా తీసుకుంటే డయాబెటిస్ మెల్లిటస్, జీర్ణశయాంతర రుగ్మతల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
- రక్తహీనతలో మేలు చేస్తుంది: రక్తహీనత లేదా మీ శరీరంలో రక్తం లోపం ఉన్నట్లయితే రాగులను తినడం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. రాగుల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్ లోపాన్ని నయం చేస్తుంది.
- బరువు తగ్గిస్తుంది: రాగులు గ్లూటెన్-ఫ్రీ.. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఈ రెండూ బరువు తగ్గడంలో సహాయపడతాయి. అమైనో ఆమ్లాలను కలిగి ఉన్న ఇతర ధాన్యాలతో పోల్చితే.. రాగులలో ఇతర ధాన్యాల కంటే డైటరీ ఫైబర్‌లో ఎక్కువగా ఉంటుంది. కొవ్వులో తక్కువగా ఉంటుంది.
- గుండెకు మంచిది: అదనపు కాలేయ కొవ్వును తొలగిస్తాయి. ఇంకా రాగిలోని పోషకాలు లెసిథిన్, మెథియోనిన్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇందులో ఉండే అమినో యాసిడ్‌లు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం..