AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yoga Mat: యోగా చేయడం ముఖ్యమే.. మరి ఎలాంటి మ్యాట్‌ను ఉపయోగిస్తున్నారు.. నిపుణులు ఏమంటున్నారంటే..

నిత్య జీవితంలో ఆరోగ్యంగా ఉండేందుకు యోగా అనేది మంచి ఉదాహరణ. వ్యాయామం చేయడంతో పాటు యోగా ఆసనాలు వేయడం ద్వారా మంచి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. యోగా చేయడం ద్వారా బాడీలోని అన్ని రకాల...

Yoga Mat: యోగా చేయడం ముఖ్యమే.. మరి ఎలాంటి మ్యాట్‌ను ఉపయోగిస్తున్నారు.. నిపుణులు ఏమంటున్నారంటే..
Yoga On Mat
Ganesh Mudavath
|

Updated on: Jan 11, 2023 | 2:41 PM

Share

నిత్య జీవితంలో ఆరోగ్యంగా ఉండేందుకు యోగా అనేది మంచి ఉదాహరణ. వ్యాయామం చేయడంతో పాటు యోగా ఆసనాలు వేయడం ద్వారా మంచి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. యోగా చేయడం ద్వారా బాడీలోని అన్ని రకాల అవయవాల పని తీరు మెరుగుపడుతుంది. అంతే కాకుండా శరీరంలో రక్త ప్రసరణ మెరుగవుతుంది. అందుకే ఇప్పుడు యోగా మళ్లీ పూర్వ వైభవం సంతరించుకుంది. యోగా చేస్తున్న వారి సంఖ్య అమాంతం పెరుగుతోంది. దీంతో పవర్ యోగా, ప్రినేటల్ యోగా, అయ్యంగార్ యోగా, శివానంద యోగా, విన్యాస యోగా, యిన్ లేదా యాంగ్ యోగా వంటి అనేక రకాలు వచ్చాయి. కరోనా వైరస్ కారణంగా ప్రపంచమంతా గృహనిర్బంధాన్ని ఎదుర్కొంది. ఆ సమయంలో వారు ఆరోగ్యంగా ఉండేందుకు యోగా ఓ చక్కని సాధనంగా ఉపయోగపడింది. జిప్పియా – 2022 గణాంకాల ప్రకారం.. యోగా అనేది గ్లోబల్ దృగ్విషయంగా మారే స్థాయికి చేరింది. ప్రస్తుతం 300 మిలియన్లకు పైగా ప్రజలు యోగా చేస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి.

యోగా ను చాలా మంది మ్యాట్ పై చేస్తుంటారు. అయితే వారు తమకు సౌకర్యవంతంగా ఉండే మ్యాట్ లను ఎంచుకోవడంలో వెనకబడి ఉంటారు. అలాంటి వారి కోసం నిపుణులు కొన్ని రకాల మ్యాట్ లను సజ్జెస్ట్ చేస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రబ్బరు మాట్స్.. మార్కెట్లలో ఇవి చాలా సాధారణం. సహజమైనది, పునరుత్పాదకమైనది. రబ్బరు అనేది చాప ఉపరితలాన్ని సృష్టిస్తుంది. గట్టిగా అలాగే ఉంటుంది. రబ్బరు మాట్‌లు భారీగా ఉన్నప్పటికీ ఈజీగా వాడేందుకు చక్కగా ఉపయోగపడతాయి.

ఇవి కూడా చదవండి

పీవీసీ మాట్స్: పాలీ వినైల్ క్లోరైడ్ మ్యాట్‌లు తప్పనిసరిగా నాణ్యత లేనివి కావు. చాలా బ్రాండ్‌లు ఇప్పుడు తమ తమ సిరీస్‌ను విడుదల చేస్తున్నాయి. ఇవి చాలా మందంగా ఉంటాయి.

టీపీఈ మాట్స్: థర్మోప్లాస్టిక్ ఎలాస్టోమర్‌తో తయారు చేసిన మాట్స్ పర్యావరణ సంబంధమైనవి. వాసన లేనివి. చాలా మృదువైనవే కాకుండా తేలికైనవి కూడా.

కాబట్టి.. యోగా చేయాలనుకునేవారు అన్ని రకాల జాగ్రత్తలు, సౌకర్యాల గురించి ఆరా తీసి సరైనవి ఎంచుకోవడం ఉత్తమం.

మరిన్ని తాజా ఆరోగ్య సమాచారం కోసం క్లిక్‌ చేయండి.