Andhra Pradesh: మంత్రి అంబటికి బిగ్ షాక్.. కేసు నమోదుకు కోర్టు ఆదేశం.. కారణమేంటంటే..
మంత్రి అంబటి రాంబాబుకు సత్తెనపల్లి కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఆయనపై కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. సత్తెనపల్లిలో సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో వైసీపీ నేతలు వసూళ్లకు పాల్పడుతున్నట్లు

మంత్రి అంబటి రాంబాబుకు సత్తెనపల్లి కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఆయనపై కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. సత్తెనపల్లిలో సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో వైసీపీ నేతలు వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. మంత్రి అంబటి రాంబాబు నేతృత్వంలోనే ఈ లక్కీ డ్రా టికెట్లను బలవంతంగా అమ్ముతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. వృద్ధుల ఫించన్ల నుంచి లక్కీ డ్రా కు రూ. 100 వసూళ్లు చేస్తారని ఆరోపణలు వచ్చాయి. అలాగే వినాయక రెస్టారెంట్ మృతుడు అనిల్ చెక్కు మాయం చేశారని కూడా ఆరోపణలు గుప్పుమన్నాయి. ఇదే అంశంపై సత్తెనపల్లి పోలీస్ స్టేషన్‌లో జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. అయితే, పోలీసులు స్పందించకపోవడంతో.. జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు సత్తెనపల్లి కోర్టును ఆశ్రయించారు. గాదె పిటిషన్‌ను విచారించిన కోర్టు.. మంత్రి అంబటిపై తక్షణమే కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశించింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..