Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sankranti: మొదలైన సంక్రాంతి సంబరాలు.. ఆకర్షిస్తున్న ముగ్గుల పోటీలు, గంగిరెద్దుల విన్యాసాలు

తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించే సంక్రాంతిని ముందస్తుగా జరుపుకుంటున్నాయి అనేక గ్రామాలు.. తాజాగా కాకినాడ జిల్లా తాళ్లరేవు కైట్ కాలేజిలో కాకినాడ రూరల్ పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలు వైభవంగా జరిగాయి.

Sankranti: మొదలైన సంక్రాంతి సంబరాలు.. ఆకర్షిస్తున్న ముగ్గుల పోటీలు, గంగిరెద్దుల విన్యాసాలు
Sankranti Festival
Follow us
Surya Kala

|

Updated on: Jan 11, 2023 | 1:33 PM

ప్రకృతి అందాలకు నిలయం ఉభయగోదావరి జిలాల్లో ధనుర్మాసం నుంచే సంక్రాంతి సంబరాలు మొదలవుతాయి. ఏ ఇంటి ముంగిట చూసినా అందమైన ముగ్గులు, గొబ్బెమ్మలు,  భోగిపిడకలు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దు ఆటలు, కొమ్మదాసుల సరదాలు కనువిందు చేస్తాయి. ఇప్పటికే పట్టణం పల్లె బాటపట్టింది. తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించే సంక్రాంతిని ముందస్తుగా జరుపుకుంటున్నాయి అనేక గ్రామాలు.. తాజాగా కాకినాడ జిల్లా తాళ్లరేవు కైట్ కాలేజిలో కాకినాడ రూరల్ పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలు వైభవంగా జరిగాయి. సంక్రాంతి సంబరాలను కాకినాడ ఎడిషనల్ ఎస్పీ సత్యనారాయణ రూరల్ సి.ఐ శ్రీనివాస్ లు ప్రారంభించారు.

గ్రామాల్లో సంక్రాంతి సంప్రదాయ క్రీడలు ఇలా ఉంటాయని విద్యార్థులకు తెలియజేయడానికి ఎస్పీ రవీంద్రనాద్ బాబు ఆదేశాలతో ఈకార్యక్రమం నిర్వహించామని కాకినాడ ఎడిషనల్ ఎస్పీ సత్యనారాయణ తెలిపారు. కైట్ కాలేజి విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు, భోగింమటలు, రంగవల్లులు, గంగిరెద్దుల విన్యాసాలు, కోలాటం, మ్యూజికల్ చైర్, క్రీడాపోటీలు, స్లో సైక్లింగ్, ముగ్గుల పోటీలు తాళ్లరేవు పెద్దలు, పోలీస్ శాఖ ఆద్వర్యం లో చక్కగా ఏర్పాటు చేసారని ఎడిషనల్ ఎస్పీ సత్యనారాయణ అన్నారు. పోటీల్లో విజేతలకు జిల్లా ఎడిషనల్ ఎస్పీ సత్యనారాయణ బహుమతులు ప్రదానం చేశారు. ఈ సంక్రాంతి ని అందరూ ఆనందంగా సాంప్రదాయబదం గా జరుపుకోవాలని ఎడిషనల్ ఎస్పీ సత్యనారాయణ ఆకాంక్షించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంద్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..