Makara sankranti: మకర సంక్రాంతి నాడు ఇక్కడ స్నానం చేస్తే.. ఏడు జన్మల పాపాలు పోతాయి.. ..!

ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి నాడు ఇక్కడ జాతర జరుగుతుంది. భక్తులు గంగానదిలో స్నానం చేసి పాపాలను పోగొట్టుకుంటారు. ఇక్కడ పుణ్యస్నానం చేస్తే వెయ్యి గోవులను దానం చేసినంత పుణ్యం లభిస్తుంది..

Makara sankranti: మకర సంక్రాంతి నాడు ఇక్కడ స్నానం చేస్తే.. ఏడు జన్మల పాపాలు పోతాయి.. ..!
Ganga Ghat
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 11, 2023 | 4:44 PM

మన దేశంలో అన్ని పండుగలకు వాటి వాటి ప్రముఖ్యత ఉంది. ఒక్కో పండుగకు ప్రత్యేక అర్థం ఉంది. అన్ని కులాలు, వర్గాలు తమ తమ సంప్రదాయంలో పండుగలు చేసుకుంటారు. అన్ని పండుగల్లో ప్రత్యేక పండగ మకర సంక్రాంతి కూడా ఒకటి. ఈ రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. వివిధ రాష్ట్రాల ప్రజలు మకర సంక్రాంతిని వివిధ పేర్లతో, విభిన్న రీతుల్లో జరుపుకుంటారు. సంక్రాంతిని ఈశాన్య ప్రాంతంలో ఖిచ్డీ అని, గుజరాత్‌లో ఉత్తరాయణం అని, దక్షిణ భారతదేశంలో పొంగల్ అని పిలుస్తారు. మకర సంక్రాంతి రోజున గంగా స్నానం చేయడం చాలా ముఖ్యం. సంక్రాంతి రోజున గంగానదిలో స్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయని విశ్వాసం. చాలా మంది భక్తులు మకర సంక్రాంతి రోజున గంగా నదిలో స్నానం చేసి దానధర్మాలు చేస్తారు. అందుకే సంక్రాంతి రోజున గంగా ఘాట్లన్నీ కిక్కిరిసిపోయి ఉంటాయి.. పుణ్యం పొందాలంటే ఏ ప్రదేశంలో స్నానం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

గంగా మహాసముద్రం : గంగా సముద్రం పశ్చిమ బెంగాల్‌లోని పవిత్ర ప్రదేశం. మకర సంక్రాంతి రోజున గంగా సముద్రంలో స్నానం చేయడం శుభప్రదం. ఇక్కడ గంగా నది, సముద్రం కలుస్తాయి కాబట్టి ఈ ప్రాంతానికి గంగా సాగర్ అని పేరు వచ్చింది. సంక్రాంతి నాడు ఇక్కడ స్నానమాచరించిన వారికి పది అశ్వమేధ యాగాలు చేసిన, వేయి గోదానాలు చేసినంత ఫలితాలు లభిస్తాయని విశ్వాసం.

త్రివేణి సంగమం (ప్రయాగరాజ) : ప్రయాగరాజ సంగమం అత్యంత పవిత్రమైన, ప్రసిద్ధ ప్రదేశాలలో ఒకటి. మకర సంక్రాంతి నాడు, ప్రయాగరాజు సంగంలో రాజయోగ స్నానాన్ని నిర్వహిస్తారు. సంక్రాంతి నాడు ఇక్కడ స్నానం చేస్తే కష్టాలన్నీ తొలగిపోయి సుఖసంతోషాలు లభిస్తాయి. గంగా, యమునా, సరస్వతీ నదుల సంగమం కనుక దీనిని త్రివేణి సంగమం అంటారు.

ఇవి కూడా చదవండి

హరిద్వార్‌లో స్నానం: హరిద్వార్ పవిత్ర పుణ్యక్షేత్రాలలో ఒకటి. సంక్రాంతికి హరిద్వార్‌లో చాలా మంది గంగాస్నానం చేస్తారు. హరిద్వార్, హర్ కీ పోడిలో చాలా ఘాట్‌లు ఉన్నప్పటికీ, విష్ణు ఘాట్ అత్యంత ప్రసిద్ధ ఘాట్. ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి నాడు ఇక్కడ జాతర జరుగుతుంది. భక్తులు గంగానదిలో స్నానం చేసి పాపాలను పోగొట్టుకుంటారు. ఇక్కడ పుణ్యస్నానం చేస్తే వెయ్యి గోవులను దానం చేసినంత పుణ్యం లభిస్తుంది

పుణ్య క్షేత్ర కాశీలో పవిత్ర స్నానం: కాశీ ప్రపంచంలోని పురాతన, ఇప్పటికీ నివసించే నగరాలలో ఒకటి. ఇది హిందువులకు అత్యంత పవిత్రమైన ప్రదేశం. పరమశివుడి జ్యోతిర్లింగం ఉన్న కాశీ అందరికీ సుపరిచితమే. కాశీలో మణికర్ణికా ఘాట్, హరిశ్చంద్ర ఘాట్ కూడా చాలా ప్రసిద్ధి చెందాయి. దీనిని మహాశ్మశాన అని పిలుస్తారు. లక్షలాది మంది ప్రజలు ఇక్కడ గంగానదిలో స్నానం చేసి కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకుంటారు. మకర సంక్రాంతికి కూడా ఇక్కడికి జనం పోటెత్తుతారు. ఆ రోజు ఇక్కడ ఖిచ్డీ మహోత్సవం ఘనంగా జరుగుతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్
విద్యార్థులకు శుభవార్త.. జనవరి 1 నుంచి 15 వరకు పాఠశాలలకు సెలవులు!
విద్యార్థులకు శుభవార్త.. జనవరి 1 నుంచి 15 వరకు పాఠశాలలకు సెలవులు!
ప్రభాస్ ను ఫాలో అవుతున్న చరణ్, ఎన్టీఆర్
ప్రభాస్ ను ఫాలో అవుతున్న చరణ్, ఎన్టీఆర్
లిప్ స్టిక్ తీసుకెళ్లడానికి రూ.27 లక్షల బ్యాగ్.. పిచ్చి పీక్స్!
లిప్ స్టిక్ తీసుకెళ్లడానికి రూ.27 లక్షల బ్యాగ్.. పిచ్చి పీక్స్!
జనవరి 1 నుంచి అమలు చేయాలని భావించిన ప్రభుత్వం.. కానీ
జనవరి 1 నుంచి అమలు చేయాలని భావించిన ప్రభుత్వం.. కానీ