Digger: అయ్యా బాబోయ్… ! ఈ ఊరిలో కుక్క పులిలా మారింది..! భయంతో జనం పరుగో పరుగు..
ఆ కుక్కను చూసిన జనాలు పులి వస్తుందనే భయంతో పరుగులుతీస్తున్నారు. ఎవరికీ వారు తమ ప్రాణాలు కాపాడుకునేందుకు వెనుకా ముందు చూడకుండా పరారవుతున్నారు. అయితే, పులి రూపంలో ఉన్నది మాత్రం కుక్క అని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అసలు విషయం ఏంటంటే..
పులి, సింహం పేర్లను కలిపి లైగర్ అనే పదం వచ్చిందని ఇటీవలి కాలంలో అందరికీ తెలిసిందే.. కానీ, కర్ణాటకలోని చామరాజనగర్‌లో ఒక విచిత్ర సంఘటన వెలుగు చూసింది. ఇక్కడి ఊర్లో డిగ్గర్ అనే కుక్క వింతగా టైగర్ రూపంలో ప్రత్యక్షమైంది. ఇది సినిమా కథ కాదండోయ్.. ఇది ఒక రైతు కథ. అవును… హనూర్ తాలూకా అజ్జీపురా గ్రామంలో పులి వేషధారణలో కుక్క సంచరిస్తోంది. ఆ కుక్కను చూసిన జనాలు పులి వస్తుందనే భయంతో పరుగులుతీస్తున్నారు. ఎవరికీ వారు తమ ప్రాణాలు కాపాడుకునేందుకు వెనుకా ముందు చూడకుండా పరారవుతున్నారు. అయితే, పులి రూపంలో ఉన్నది మాత్రం కుక్క అని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అసలు విషయం ఏంటంటే..
ఎవరో అజ్ఞాత రైతు ఈ కుక్కను పులి వేషంలోకి మార్చేసినట్టుగా తెలిసింది. పొలంలో పండే పంటలను వన్యప్రాణుల బారి నుంచి కాపాడేందుకు కొబ్బరి చెట్లకు మనిషి బొమ్మ, లౌడ్ స్పీకర్, గంటలు మోగించటం వంటివి చేస్తుంటారు రైతులు. అయితే, ఇక్కడ రైతు మాత్రం వినూత్న ప్రయత్నం చేశాడు. వీధి కుక్కను పులిలా మార్చేశాడు. ఈ వింత ఆలోచనకు అడవి జంతువులు, కోతులు భయపడుతున్నాయో,లేదో తెలియదు గానీ, వాహనదారులు, చుట్టుపక్కల నుంచి వచ్చే తెలియని వ్యక్తులు మాత్రం షాక్‌కు గురవుతున్నారు. అజ్జీపురా రహదారి రాష్ట్ర రహదారి, ఇక్కడ రోజూ వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ సమయంలో తమకు ఎదురుగా వచ్చిన ఈ పులిని చూసి కేకలు భయంతో వేస్తున్నారు.
పులి రూపంలో ఉన్నకుక్కను చూసిన ప్రజలు, బాటసారులు భయాందోళనకు గురవుతున్నారు. కానీ, చివరకు ఇది పులి కాదని గ్రహించి హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకుంటున్నారు. మరి ఇప్పుడు పులిలాంటి కుక్కను చూసి కోతులు, పక్షులు పరుగులు తీస్తాయో లేదో వేచి చూడాలి.. ఇది విజయవంతమైతే రైతన్న ఆలోచన మరిన్ని ఊర్లకు పాకేయటం ఖాయం అంటున్నారు చుట్టుపక్కల జనాలు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.