Telugu News India News Anand Mahindra praises Indian space agency ISRO after UK space mission's failure Telugu News
Anand Mahindra: ఇస్రోపై ప్రశంసలు కురిపించిన ఆనంద్ మహీంద్రా.. UK అంతరిక్ష యాత్ర విఫలం తర్వాత..
సోమవారం రాత్రి అంతరిక్షంలోకి దూసుకుపోయిన విమానం.. రాకెట్‌ను విజయవంతంగా విడుదల చేయగా.. ఆ తర్వాత రాకెట్ శాటిలైట్లను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టడంలో విఫలమైంది.
ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్స్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO)పై ప్రశంసలు కురిపించారు. అంతరిక్షంలోకి ఉపగ్రహాలను ప్రయోగించడానికి బ్రిటన్ చేసిన ప్రయత్నాలు విఫలమైన నేపద్ధ్యంలో మహీంద్రా గ్రూప్ చీఫ్ నుండి ప్రతిస్పందన వచ్చింది. భారత అంతరిక్ష సంస్థ ఇస్రో అంతరిక్ష రంగంలో అద్భుత కృషి చేస్తోందని ఆనంద్ మహీంద్రా ప్రశంసించారు. ది స్టార్ట్ మీ అప్ పేరుతో బ్రిటన్‌కు రాకెట్ ప్రయోగం విఫలమైన తర్వాత ఆయన స్పందించడం ప్రాధాన్యం సంతరించుకున్నది. ఇది భిన్నమైన ప్రయోగం అని నేను అంగీకరిస్తున్నాను. ఇస్రో ప్రయోగ రికార్డును మనం ఎంత అభినందించాలో ఇలాంటి సందర్భాలు మనకు తెలియజేస్తాయి’ అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.
I recognise that this was a very different type of orbital launch but it stills tells me how much more we should appreciate and admire the launch record of @isrohttps://t.co/K48TrE5VLy
విమానం ద్వారా బ్రిటన్ తొలి అంతరిక్ష యాత్ర ప్రయోగం విఫలమైంది. ‘ది స్టార్ట్ మీ అప్’ పేరుతో బ్రిటన్‌కు చెందిన వర్జీన్ ఆర్బిట్ సంస్థ ప్రయోగాన్ని చేపట్టింది. సోమవారం రాత్రి అంతరిక్షంలోకి దూసుకుపోయిన విమానం.. రాకెట్‌ను విజయవంతంగా విడుదల చేయగా.. ఆ తర్వాత రాకెట్ శాటిలైట్లను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టడంలో విఫలమైంది.
రాకెట్ విడుదల చేసిన తర్వాత సిబ్బందిని విమానం క్షేమంగా భూమిపై తీసుకువచ్చింది. అయితే, అంతరిక్షంలోకి రాకెట్ నిలువునా దూసుకుపోకుండా విమానంలో కొంత దూరం తీసుకెళ్లి అక్కడి నుంచి లాంచర్ వెహికిల్ సాయంతో అంతరిక్షంలోకి పంపారు.