AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Video: మెట్రోలో రెచ్చిపోయిన యువతి.. పిచ్చిపిచ్చిగా చేస్తూ చిర్రెత్తించింది.. మండిపడుతున్న నెటిజన్లు..

ఇంటర్నెట్ వాడకం పెరిగినప్పటి నుంచి వెర్రి వేయి విధాలు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియాలో పాపులారిటీ సాధించడం కోసం చిత్రవిచిత్రమైన పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని సార్లు ప్రమాదాల...

Trending Video: మెట్రోలో రెచ్చిపోయిన యువతి.. పిచ్చిపిచ్చిగా చేస్తూ చిర్రెత్తించింది.. మండిపడుతున్న నెటిజన్లు..
Young Woman In Metro
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jan 10, 2023 | 9:58 PM

ఇంటర్నెట్ వాడకం పెరిగినప్పటి నుంచి వెర్రి వేయి విధాలు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియాలో పాపులారిటీ సాధించడం కోసం చిత్రవిచిత్రమైన పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని సార్లు ప్రమాదాల బారిన పడుతున్నారు. అంతే కాకుండా చుట్టుపక్కలా ఉన్నవారికీ ఇబ్బంది కలిగిస్తున్నారు. ఈ మధ్య ఇలాంటి విన్యాసాలకు మెట్రో రైలును వేదికగా చేసుకోవడం పరిపాటిగా మారింది. మెట్రో ట్రైన్‌లో ప్రయాణిస్తున్న సమయంలో రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. ఆ మధ్య ఓ యువకుడు టవల్‌ చుట్టుకుని ఫోజు కొడుతూ వీడియో చేస్తే, మరో యువకుడు ఏకంగా మెట్రో ట్రైన్‌తోనే రేసింగ్‌ పెట్టుకున్నాడు. ఓ యువకుడు అయితే నాకు గర్ల్‌ఫ్రెండ్‌ కావాలంటూ మెడలో బోర్డు వేసుకొని అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. తాజాగా ఓ యువతి ఢిల్లీ మెట్రో ట్రైన్‌లో చేసిన చేష్టలు నెటిజన్లు పిచ్చెక్కిస్తున్నాయి.

వైరల్ అవుతున్న వీడియోలో ఓ యువతి ఖాళీగా ఉన్న మెట్రో రైలు బోగీలో తనకు వచ్చిన విద్యలన్నీ ప్రదర్శించింది. అంతేకాదు ఈ విన్యాసాలను ఓ వీడియోగా తీయించి ‘అపర్ణ దేవయాల్‘ పేరుతో ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. మెట్రోలో ప్రయాణికులు కింద పడిపోకుండా పట్టుకునేందుకు ఆధారంగా ఉండే హ్యాండ్ రెయిలర్లను చేత్తో పట్టుకుని అటూ, ఇటూ ఉయ్యాల మాదిరి ఊగిపోయింది. మధ్యలో యోగసనాలు వేసింది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by KOKO ? (@aparna_devyal)

ఆ తర్వాత మెట్రోలో సీట్ పైకి ఎక్కి డ్యాన్స్ చేస్తూ రచ్చ రచ్చ చేసింది. నెట్టంట వైరల్‌ అవుతున్న ఈ యువతి చేష్టలపై యూజర్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ‘‘అపర్ణా ఇలాంటివి చేయకు. దయచేసి అర్థం చేసుకో’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం