Shocking Video: దారుణం.. రోడ్డుపై నిద్రిస్తున్న శునకాన్ని కారుతో తొక్కించి చంపాడు!

రోడ్డుపై నిద్రిస్తున్న శునకాన్ని కారుతో తొక్కించి చంపాడో పెద్దమనిషి. సోషల్‌ మీడియాలో ఇందుకు సంబందించిన వీడియో వైరల్‌ అవడంతో ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

Shocking Video: దారుణం.. రోడ్డుపై నిద్రిస్తున్న శునకాన్ని కారుతో తొక్కించి చంపాడు!
Shocking Video
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 10, 2023 | 12:12 PM

రోడ్డుపై నిద్రిస్తున్న శునకాన్ని కారుతో తొక్కించి చంపాడో పెద్దమనిషి. సోషల్‌ మీడియాలో ఇందుకు సంబందించిన వీడియో వైరల్‌ అవడంతో ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

బెంగళూరులో జనవరి 7న ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఈ వీడియోలో రోడ్డు మధ్యలో నిద్రిస్తున్న శునకం కారు శబ్ధానికి మేలుకొని కూర్చోవడం కనిపిస్తుంది. ఐతే కారు డ్రైవర్‌ కారును కాస్త స్లోగా నడిపినా లేదా హారన్‌ కొట్టినా అక్కడి నుంచి శునకం వెళ్లిపోయేది. ఐతే అలా చేయకుండా ఉద్దేశపూర్వకంగా కారును శునకం మీదగా నడిపి కిరాతకంగా చంపాడం వీడియోలో చూడవచ్చు. కారు చక్రాల కింద శునకం నలిగి విలవిల కొట్టుకోవడం వీడియోలో కనిపిస్తుంది. కొందరు స్థానికులు కుక్కను కాపాడే ప్రయత్నం చేసినా ఫలితంలేకపోయింది. కారు రిజిస్ట్రేషన్ నంబర్ KA 05 MP 5836గా గుర్తించారు. ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసుకున్న కర్ణాటక పోలీసులు కారు డ్రైవర్‌ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సోమవారం మీడియాకు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.