IAS Ashok Khemka: 56వ సారి బదిలీ అయిన ఐఏఎస్ ఆఫీసర్ అశోక్ ఖేమ్కా.. ! కారణం అదేనా..?
సీనియర్ ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా మరోమారు బదిలీ అయ్యారు. తన 30 ఏళ్ల కెరీర్‌లో ఇది 56వ బదిలీ అవ్వడం విశేషం. సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్‌మెంట్‌లో అడిషనల్ చీఫ్ సెక్రటరీ ఉన్న..
సీనియర్ ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా మరోమారు బదిలీ అయ్యారు. తన 30 ఏళ్ల కెరీర్‌లో ఇది 56వ బదిలీ అవ్వడం విశేషం. సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్‌మెంట్‌లో అడిషనల్ చీఫ్ సెక్రటరీ ఉన్న అశోక్ ఖేమ్కా ఆర్కైవ్స్ డిపార్ట్‌మెంట్ అడిషనల్ చీఫ్ సెక్రటరీగా ట్రాన్స్‌ఫర్ చేస్తున్నట్లు హర్యానా ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. బదిలీలకు నిర్దిష్ట కారణాలేవీ ప్రకటనలో పేర్కొనలేదు. కొన్ని రోజుల క్రితం హర్యానా చీఫ్ సెక్రటరీ సర్వేష్ కౌశల్‌కు రాసిన లేఖ నేపథ్యంలో ట్రాన్స్‌ఫర్ చేస్తున్నట్లు సమాచారం. ఖేల్కా పనిచేస్తున్న సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్‌మెంట్‌ను ఉన్నత విద్యా శాఖలో విలీనం చేసినందున తనకు తగినంత పని లేకుండా పోయిందని, తన ర్యాంక్ ఉన్న అధికారికి వారంలో కనీసం 40 గంటల పని ఉండే డిపార్ట్‌మెంట్ కేటాయించాలని ఖేమ్కా ఆ లేఖలో పేర్కొన్నారు.
ఐఏఎస్ అధికారి కెరీర్‌లో వివాదాలు, తరచూ బదిలీలు జరుగుతున్నాయి. అతని చివరి కొత్త పోస్టింగ్ అక్టోబర్ 2021లో జరిగింది. ఖేమ్కా ఆర్కైవ్స్ శాఖలో పనిచేయడం ఇది నాలుగోసారి. తన కెరీర్‌లో ఎక్కువ సార్లు అప్రాధాన్య పోస్టుల్లోనే కొనసాగిన ఖేమ్కా కెరీర్‌లో ప్రతి ఆరు నెలలకోసారి ట్రాన్స్‌ఫర్ అవ్వడం విశేషం. 1991 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన అశోక్ ఖేమ్కా 2012లో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా ల్యాండ్ డీల్ మ్యుటేషన్‌ను రద్దు చేయడంతో ఒక్కసారిగా దేశమంతా మారుమ్రోగిపోయారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.