Air pollution: ఢిల్లీలో ప్రమాదకర స్టేజ్‌లో వాయు కాలుష్యం.. రెడ్ అలెర్ట్ జారీ.. BS-3 పెట్రోల్‌, BS-4 డీజిల్‌ కార్లపై నిషేధం

చుట్టుపక్కల రాష్ట్రాల్లో వ్యవసాయ వ్యర్థాలు తగులబెట్టకుండా చర్యలు తీసుకున్న ఢిల్లీ ప్రభుత్వం.. ఇప్పుడు కాలుష్యకారక వాహనాలపై తాత్కాలిక నిషేధం విధించింది. జనవరి ఫస్ట్‌ నుంచి ఢిల్లీలో విపరీతమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి.

Air pollution: ఢిల్లీలో ప్రమాదకర స్టేజ్‌లో వాయు కాలుష్యం.. రెడ్ అలెర్ట్ జారీ.. BS-3 పెట్రోల్‌, BS-4 డీజిల్‌ కార్లపై నిషేధం
Air Pollution In Delhi
Follow us
Surya Kala

|

Updated on: Jan 10, 2023 | 8:52 AM

దేశ రాజధాని ఢిల్లీలో ప్రమాదకరస్థాయిలోకి  వాయు కాలుష్యం చేరుకుంది. ఒకవైపు శీతల గాలులు, మరోవైపు పొగమంచు.. ఢిల్లీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రాజధాని నగరం గ్యాస్‌ చాంబర్‌గా మారిపోయింది. వాయు కాలుష్యం మరోసారి ప్రమాదకరస్థాయిలో నమోదవుతోంది. ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారుతున్న నేపథ్యంలో.. ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. BS-3 పెట్రోల్‌, BS-4 డీజిల్‌ ఫోర్‌వీలర్లపై తాత్కాలిక నిషేధం విధించింది. ఈ ఉదయం నుంచి ఆ నిర్ణయం అమల్లోకి వచ్చింది.

ఇప్పటికే చుట్టుపక్కల రాష్ట్రాల్లో వ్యవసాయ వ్యర్థాలు తగులబెట్టకుండా చర్యలు తీసుకున్న ఢిల్లీ ప్రభుత్వం.. ఇప్పుడు కాలుష్యకారక వాహనాలపై తాత్కాలిక నిషేధం విధించింది. జనవరి ఫస్ట్‌ నుంచి ఢిల్లీలో విపరీతమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. గత తొమ్మిదేళ్లలో ఎన్నడూ లేనంత స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఆదివారం 1.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. సరాసరి కనిష్ట ఉష్ణోగ్రతలు 4 డిగ్రీలుగా ఉన్నాయి. వాతావరణ విభాగం రెడ్‌అలెర్ట్ జారీ చేయడం.. కాలుష్య నియంత్రణలను శక్తివంతంగా అమలు చేయాలని కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ – CAQM కేంద్రానికి కీలక సూచనలు చేసిన నేపథ్యంలో కేజ్రీవాల్‌ సర్కార్‌ కీలక నిర్ణయాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..