Tamil Nadu: తమిళనాడు గవర్నర్‌పై డీఎంకే యుద్ధం.. ‘గెట్ అవుట్ రవి’ పేరుతో సంచలన పోస్టర్లు..

తమిళనాడులో గవర్నర్‌ అండ్ సీఎం మధ్య సాగుతోన్న కోల్డ్‌ వార్‌ బరస్ట్‌ అయ్యింది. అసెంబ్లీ వేదికగా గవర్నర్‌ వర్సెస్‌ సీఎం ఫైట్‌ కాకరేపుతోంది. రాజ్‌భవన్‌ అండ్‌ సెక్రటేరియట్‌ మధ్య గ్యాప్‌ రోజురోజుకీ..

Tamil Nadu: తమిళనాడు గవర్నర్‌పై డీఎంకే యుద్ధం.. ‘గెట్ అవుట్ రవి’ పేరుతో సంచలన పోస్టర్లు..
Get Out Ravi
Follow us
Shiva Prajapati

|

Updated on: Jan 10, 2023 | 12:18 PM

తమిళనాడులో గవర్నర్‌ అండ్ సీఎం మధ్య సాగుతోన్న కోల్డ్‌ వార్‌ బరస్ట్‌ అయ్యింది. అసెంబ్లీ వేదికగా గవర్నర్‌ వర్సెస్‌ సీఎం ఫైట్‌ కాకరేపుతోంది. రాజ్‌భవన్‌ అండ్‌ సెక్రటేరియట్‌ మధ్య గ్యాప్‌ రోజురోజుకీ పెరిగిపోతోంది. పరిస్థితి ఎంతవరకూ వచ్చిందంటే అసెంబ్లీలో ప్రసంగాన్ని మధ్యలో ఆపేసి గవర్నర్‌ వెళ్లిపోయేంతగా. అవును, తమిళనాడు అసెంబ్లీ సాక్షిగా గవర్నర్‌ రవి, సీఎం స్టాలిన్‌ మధ్య రచ్చ జరిగింది. ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగం కాకుండా ఇతర అంశాలను గవర్నర్‌ ప్రస్తావించారంటూ డీఎంకే కూటమి ఎమ్మెల్యేలు సభలో ఆందోళనకు దిగారు. దాంతో, ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసి వెళ్లిపోయారు గవర్నర్‌ రవి.

అసెంబ్లీలో గవర్నర్‌ రవి ప్రసంగాన్ని డీఎంకేతో సహా మిత్రపక్ష ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. లౌకికవాదంతోపాటు పెరియార్, అంబేద్కర్‌, కె.కామరాజ్‌, సీఎన్‌ అన్నాదురై, కరుణానిధి లాంటి ప్రముఖ పేర్లను ప్రస్తావించకుండా గవర్నర్ ప్రసంగించడం అభ్యంతరం తెలిపారు. తమిళనాడు పేరును తమిళగం అని మార్చాలన్న గవర్నర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలనే తమిళ ప్రజలను గవర్నర్‌ కించపరుస్తున్నారని ఆరోపించారు డీఎంకే సభ్యులు. తమిళనాడు చరిత్రను వక్రీకరించి పుస్తకాలు రాశారని, వాటిని సవరించాల్సిన అవసరం ఉందన్నారు గవర్నర్‌ రవి. తమిళనాడు అంటే ద్రవిడుల భూమి అన్న ప్రచారం జరిగిందని, కాని ఆ పేరు తమిళగం అని మార్చాలన్నారు. దీనిపై సీఎం స్టాలిన్‌తోపాటు డీఎంకే సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల తీరును నిరసిస్తూ తన ప్రసంగాన్ని ఆపేసి వెళ్లిపోయారు గవర్నర్‌ రవి.

ఇవి కూడా చదవండి

దాంతో, రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసిన ప్రసంగాన్ని మాత్రమే రికార్డు చేయాలంటూ సీఎం స్టాలిన్ స్పీకర్‌ను కోరారు. అంతేకాదు, రాష్ట్ర ప్రభుత్వ ప్రసంగాన్ని యథావిధిగా ఉంచాలంటూ అసెంబ్లీ తీర్మానాన్ని కూడా సభ ఆమోదించింది. అయితే, గవర్నర్‌ ప్రసంగం కొనసాగుతున్నంతసేపు, అధికార సభ్యుల నినాదాలతో దద్దరిల్లిపోయింది తమిళనాడు అసెంబ్లీ. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతాలను ఇక్కడ రుద్దొద్దు, దయచేసి తమిళనాడు వదిలి వెళ్లిపోండి అంటూ నినాదాలు చేశారు డీఎంకే అండ్ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు.

గెట్ అవుట్ రవి..

ఇదిలాఉండగా, గవర్నర్ వ్యవహారం శృతిమించిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న డీఎంకే నేతలు.. ఊహించని విధంగా ‘గెట్ అవుట్ రవి’ అంటూ ప్రచారం చేస్తున్నారు. గవర్నర్‌కు వ్యతిరేకంగా ‘గెట్ అవుట్ రవి’ అంటూ తమిళనాడు వ్యాప్తంగా పోస్టర్లు అంటించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలోనూ ఇదే స్లోగన్‌తో హ్యాష్‌ట్యాగ్ క్రియేట్ చేసి ట్రెండ్ చేస్తున్నారు. ఇప్పుడిది దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..