Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL: 300 చేసినోడికే టీమిండియాలో చోటు దక్కలే.. 200 ఓ లెక్కా.. ఆ మాజీ ప్లేయర్‌ దుస్థితే ఇషాన్‌కు పట్టనుందా?

IND vs SL: శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్‌లో భారత జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ భారత జట్టు ప్లేయింగ్ ఎలెవన్‌లో భాగం కావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇషాన్‌ కూడా కరుణ్‌ నాయర్‌ లాంటి పరిస్థితిలోనే ఉంటాడా అనేది ప్రశ్నగా మారింది.

IND vs SL: 300 చేసినోడికే టీమిండియాలో చోటు దక్కలే.. 200 ఓ లెక్కా.. ఆ మాజీ ప్లేయర్‌ దుస్థితే ఇషాన్‌కు పట్టనుందా?
Ishan Kishan
Follow us
Venkata Chari

|

Updated on: Jan 10, 2023 | 6:35 AM

శ్రీలంకతో వన్డే సిరీస్‌కు సంబంధించి అభిమానులకు అనేక రకాల ప్రశ్నలు ఉన్నాయి. జనవరి 10, మంగళవారం నుంచి జరగనున్న ఈ సిరీస్‌కు ముందు భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ప్రశ్నలను సమాధానం ఇవ్వాల్సి ఉన్నా.. వాటిని మరింతగా పెంచాడు. వన్డే సిరీస్‌కు సంబంధించి మరోసారి ఎడమచేతి వాటం ఓపెనర్ ఇషాన్ కిషన్‌కు అవకాశం ఇస్తారని అభిమానులు ఆశించారు. అయితే వన్డే సిరీస్‌లో ప్లేయింగ్ ఎలెవన్‌లో ఇషాన్‌ను కాకుండా శుభ్‌మాన్ గిల్‌ను తీసుకుంటారని రోహిత్ శర్మ విలేకరుల సమావేశంలో స్పష్టం చేశాడు.

కరుణ్ నాయర్ పరిస్థితే ఇషాన్ కిషన్‌కు..

రోహిత్ శర్మ సమాధానం తర్వాత భారత జట్టులో చోటు దక్కించుకోవడానికి డబుల్ సెంచరీ సరిపోదని తేలిపోయింది. బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లోని చివరి మ్యాచ్‌లో ఇషాన్ మెరుపు డబుల్ సెంచరీ సాధించాడు. అయితే ఆ తర్వాత కూడా శ్రీలంకతో వన్డే సిరీస్‌లో ప్లేయింగ్ ఎలెవన్‌లో అతనికి చోటు దక్కలేదు.

నాయర్ టెస్ట్ క్రికెట్‌లో భారతదేశం తరపున ట్రిపుల్ సెంచరీ సాధించాడు. అయితే అతను కేవలం 6 టెస్ట్ మ్యాచ్‌లు మాత్రమే ఆడగలిగాడు. భారత్ తరపున టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ చేసిన రెండో బ్యాట్స్‌మెన్‌గా నాయర్ నిలిచాడు. అతను 7 టెస్టు మ్యాచ్‌లలో 62.33 సగటుతో 374 పరుగులు చేశాడు.

ఇవి కూడా చదవండి

విశేషమేమిటంటే, ఇషాన్ కిషన్ ఇప్పటివరకు భారత జట్టు తరపున మొత్తం 10 వన్డేలు, 24 టీ20 ఇంటర్నేషనల్స్ ఆడాడు. ఈ వన్డేల్లో అతను 53 సగటుతో 477 పరుగులు చేశాడు. ఇందులో ఒక డబుల్ సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు సాధించాడు. ఇది కాకుండా, 24 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఇషాన్ 27.34 సగటు, 127.84 స్ట్రైక్ రేట్‌తో 629 పరుగులు చేశాడు. ఇందులో 4 అర్థ సెంచరీలు ఉన్నాయి.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..