IND vs SL 1st ODI: నేటినుంచే వన్డే సమరం.. లంకను ఢీకొట్టేందుకు సిద్ధమైన రోహిత్ సేన.. రికార్డులు, ప్లేయింగ్ XI..

IND vs SL Head To Head Records: టీ20ల తర్వాత వన్డే సిరీస్‌లో భారత్, శ్రీలంక ఢీకొనబోతున్నాయి. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ గౌహతి మైదానంలో జరగనుంది. భారత జట్టుకు రోహిత్ శర్మ నాయకత్వం వహించనున్నాడు.

IND vs SL 1st ODI: నేటినుంచే వన్డే సమరం.. లంకను ఢీకొట్టేందుకు సిద్ధమైన రోహిత్ సేన.. రికార్డులు, ప్లేయింగ్ XI..
Ind Vs Sl 2nd Odi
Follow us

|

Updated on: Jan 10, 2023 | 7:08 AM

నేటినుంచి టీమిండియా-శ్రీలంక మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. హార్దిక్ పాండ్యా నాయకత్వంలో టీ20 సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకున్న భారత్ ఇప్పుడు వన్డేల్లో సత్తా చాటాలని చూస్తోంది. ప్రస్తుతం ఫిట్‌గా ఉన్న రోహిత్ శర్మ వన్డే సిరీస్‌లో భారత్‌కు నాయకత్వం వహించనున్నాడు. బంగ్లాదేశ్ పర్యటనలో రోహిత్ గాయపడ్డాడు. అదే సమయంలో శ్రీలంక జట్టుకు దసున్ షనక నాయకత్వం వహించనున్నాడు. ఈ క్రమంలో రెండు జట్ల మధ్య వన్డే గణాంకాలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం..

భారత్, శ్రీలంక జట్లు మొత్తం 162 వన్డేల్లో తలపడ్డాయి. వన్డే సమరంలోనూ భారత జట్టు పైచేయి సాధించింది. భారత్ 93 మ్యాచ్‌లు గెలుపొందగా, శ్రీలంక 57 మ్యాచ్‌లు గెలిచింది. 11 మ్యాచ్‌ల్లో ఫలితం లేకపోగా, ఒక మ్యాచ్ టై అయింది. భారత్ వర్సెస్ శ్రీలంక జట్లు 40 సంవత్సరాలకు పైగా ఒకదానితో ఒకటి వన్డే మ్యాచ్‌లు ఆడుతున్నాయి. 1979లో టీమిండియా-శ్రీలంక మధ్య వన్డేల్లో తొలి ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక విజయం సాధించింది.

భారత్-శ్రీలంక వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు గ్రేట్ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ పేరిట నమోదైంది. సచిన్ 1990 నుంచి 2012 వరకు శ్రీలంకతో 84 మ్యాచ్‌లు ఆడాడు. 43.84 సగటుతో 3113 పరుగులు చేశాడు. సచిన్ 8 సెంచరీలు, 17 హాఫ్ సెంచరీలు సాధించాడు. సచిన్ తర్వాత సనత్ జయసూర్య (2899 పరుగులు), కుమార సంగక్కర (2700 పరుగులు), మహేల జయవర్ధనే (2666 పరుగులు), ఎంఎస్ ధోని (2383 పరుగులు) వంటి మాజీ బ్యాట్స్‌మెన్‌లు జాబితాలో నిలిచారు.

ఇవి కూడా చదవండి

అదే సమయంలో, గ్రేట్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ భారత్-శ్రీలంక వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. భారత్‌పై 63 మ్యాచ్‌లు ఆడి 74 వికెట్లు తీశాడు. అతని సగటు 31.78, ఎకానమీ రేటు 4.28గా నిలిచింది. ఒకసారి ఐదు వికెట్లు తీశాడు. ఈ జాబితాలో మురళీధరన్‌తో పాటు చమిందా వాస్ (70 వికెట్లు), జహీర్ ఖాన్ (66 వికెట్లు), హర్భజన్ సింగ్ (61 వికెట్లు), అజిత్ అగార్కర్ (49 వికెట్లు) నిలిచారు.

ఇరుజట్ల ప్లేయింగ్ 11..

టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (కీపర్), శ్రేయాస్ అయ్యర్ / సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, మహమ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్

శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్ (కీపర్), అవిష్క ఫెర్నాండో, ధనంజయ డి సిల్వా, చరిత్ అసలంక, దసున్ షనక (కెప్టెన్), వనిందు హసరంగా, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, లహిరు కుమార, జెఫ్రీ వాండర్సే

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రజలకు అలర్ట్‌.. శుక్రవారం ఎండలతో జాగ్రత్త అంటోన్న అధికారులు..
ప్రజలకు అలర్ట్‌.. శుక్రవారం ఎండలతో జాగ్రత్త అంటోన్న అధికారులు..
సినిమాను మించిన ట్వీట్స్ గురూ..! అప్పుడు గొడవపడ్డారు.. ఇప్పుడు..
సినిమాను మించిన ట్వీట్స్ గురూ..! అప్పుడు గొడవపడ్డారు.. ఇప్పుడు..
బీఆర్‌ఎస్‌లో కేకే కలకలం.. కేశవరావు పార్టీ మారడానికి కారణాలేంటి?
బీఆర్‌ఎస్‌లో కేకే కలకలం.. కేశవరావు పార్టీ మారడానికి కారణాలేంటి?
వందల కోట్ల ఆస్తి ఉన్నా.. 20 ఏళ్ల వరకు కొడుక్కి చెప్పని తండ్రి
వందల కోట్ల ఆస్తి ఉన్నా.. 20 ఏళ్ల వరకు కొడుక్కి చెప్పని తండ్రి
ప్రధాని మోదీతో బిల్‌గేట్స్‌ మాటామంతి.. ఏం మాట్లాడారో తెలియాలంటే
ప్రధాని మోదీతో బిల్‌గేట్స్‌ మాటామంతి.. ఏం మాట్లాడారో తెలియాలంటే
ఎన్నికల తర్వాత రీచార్జ్ చార్జీల బాదుడు..?
ఎన్నికల తర్వాత రీచార్జ్ చార్జీల బాదుడు..?
ఊరికే గ్రేట్ డైరెక్టర్ అవ్వరు మరి..!
ఊరికే గ్రేట్ డైరెక్టర్ అవ్వరు మరి..!
ఫిన్ లాండ్ ప్రజలు అంత హ్యాపీ ఎందుకబ్బా.. కారణాలు ఇవే..
ఫిన్ లాండ్ ప్రజలు అంత హ్యాపీ ఎందుకబ్బా.. కారణాలు ఇవే..
శ్రీశైలం భక్తులకు అలర్ట్.. ఆ పూజలను రద్దు చేసిన దేవస్థానం
శ్రీశైలం భక్తులకు అలర్ట్.. ఆ పూజలను రద్దు చేసిన దేవస్థానం
ట్రైన్ ఏసీ భోగీలో ఏదో వింత వాసన.. ఓ ప్రయాణీకుడి బ్యాగ్ చెక్ చేయగా
ట్రైన్ ఏసీ భోగీలో ఏదో వింత వాసన.. ఓ ప్రయాణీకుడి బ్యాగ్ చెక్ చేయగా