Rohit Sharma: హిట్‌మ్యాన్‌ను చూడగానే ఎమోషనల్.. దగ్గరకెళ్లి ఓదార్చిన రోహిత్.. నెట్టింట్లో వీడియో వైరల్..
కొంతమంది వ్యక్తులను, కొన్ని ఘటనలు చూసినప్పుడు భావోద్వేగానికి గురవుతూ ఉంటారు. మనం ఎంతో అభిమానించే వ్యక్తులు ఒక్కసారిగా మన కళ్లముందు ప్రత్యక్షమైతే.. ఆనందంలో కూడా కన్నీళ్లు పెట్టుకుంటాం. ఇప్పుడు ఇలాంటి ఓ వీడియో..
కొంతమంది వ్యక్తులను, కొన్ని ఘటనలు చూసినప్పుడు భావోద్వేగానికి గురవుతూ ఉంటారు. మనం ఎంతో అభిమానించే వ్యక్తులు ఒక్కసారిగా మన కళ్లముందు ప్రత్యక్షమైతే.. ఆనందంలో కూడా కన్నీళ్లు పెట్టుకుంటాం. ఇప్పుడు ఇలాంటి ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మను చూసి కన్నీళ్లు పెట్టుకున్న యువ అస్సామీ అభిమానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. మంగళవారం నుంచి శ్రీలంకతో భారత్ వన్డే సిరీస్ ఆడనుంది. మొదటి మ్యాచ్ గౌహతిలో ఆడనుంది. దీనిలో భాగంగా మ్యాచ్‌కు ఓ రోజు ముందు మీడియా సమావేశం ముగించుకుని వెళ్తున్నప్పుడు.. స్టేడియం వెలుపల గుమిగూడిన కొంతమంది అభిమానులను కలుసుకుని పలకరించే ప్రయత్నం చేశాడు రోహిత్. ఇంతలో భారతీయ జెర్సిని ధరించిన ఒక యువకుడు హిట్‌మ్యాన్‌ను చూసి భావోద్వేగానికి గురయ్యాడు. దీనిని గమనించిన రోహిత్ శర్మ ఆ అభిమానిని ఓదార్చే ప్రయత్నం చేశాడు.
మూడు మ్యాచ్‌లో టీ20 సిరీస్‌ను 2-1తో భారత్ గెల్చుకున్న తర్వాత.. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్ ఆడనుంది. జనవరి 10వ తేదీ మంగళవారం మొదటి మ్యాచ్ జరగనుండగా.. సీనియర్ ప్లేయర్లు ఈ సిరీస్‌లో గాయాల నుంచి కోలుకుని జట్టులోకి రానున్నారు. రోహిత్ శర్మ గాయం నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి రానున్నారు. రోహిత్ శర్మ మెన్ ఇన్ బ్లూకు నాయకత్వం వహించనున్నాడు.
మ్యాచ్‌కు ముందు మీడియాతో రోహిత్ శర్మ మాట్లాడుతూ, టీ20ల నుండి రిటైర్ అయ్యే ఉద్దేశ్యం తనకు ఇంకా లేదని చెప్పాడు. మొదట, బ్యాక్-టు-బ్యాక్ మ్యాచ్‌లు ఆడటం సాధ్యం కాదని, అన్ని ఫార్మాట్ ప్లేయర్‌లకు తగినంత విరామం ఇవ్వాలని అభిప్రాయపడ్డాడు.తమకు న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఉందని, ఏమి జరుగుతుందో చూద్దామన్నాడు. ఐపిఎల్ తర్వాత తాను పొట్టి ఫార్మట్ నుంచి రిటైర్ అయ్యేందుకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పాడు రోహిత్ శర్మ.
Cricketer Rohit Sharma interacting with an young cricket fan from Assam in Guwahati.
Adorable Moments!@ImRo45 pic.twitter.com/Nyzc4D9fHg
— Pramod Boro (@PramodBoroBTR) January 9, 2023
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..