- Telugu News Photo Gallery Cricket photos Suryakumar Yadav Secret Coach Wife Devisha Shetty Who Push Fitness
Suryakumar Yadav: నా ఫిట్‌నెస్‌కు ఆమే కారణం.. సీక్రెట్ కోచ్ గురించి నోరు విప్పిన సూర్య
సీక్రెట్ కోచ్ గురించి నోరు విప్పిన సూర్యకుమార్ యాదవ్.. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో మార్మోగుతున్న పేరు. ఎంట్రీ ఇచ్చిన రెండేళ్లలోనే టీ20 ఫార్మాట్‌లోనే ప్రపంచంలోనే నంబర్‌వన్ బ్యాట్స్‌మెన్‌గా అవతరించాడు.
Basha Shek | Edited By: TV9 Telugu
Updated on: Nov 23, 2023 | 1:19 PM

సూర్యకుమార్ యాదవ్.. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో మార్మోగుతున్న పేరు. ఎంట్రీ ఇచ్చిన రెండేళ్లలోనే టీ20 ఫార్మాట్‌లోనే ప్రపంచంలోనే నంబర్‌వన్ బ్యాట్స్‌మెన్‌గా అవతరించాడు.

ఈ కారణంగా శ్రీలంకతో జరిగిన టీ 20 సిరీస్‌లో అతన్ని వైస్ కెప్టెన్‌గా నియమించారు. అక్కడ అతను ఒంటిచేత్తో భారత్‌కు 2-1 సిరీస్‌ని అందించాడు. శ్రీలంకతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో సూర్య 51 బంతుల్లో 112 పరుగులతో అజేయంగా నిలిచాడు.

సూర్య కేవలం 45 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మూడో టీ20 మ్యాచ్‌లో అతని అద్భుతమైన షాట్లు, ఫిట్‌నెస్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. మ్యాచ్ అనంతరం సూర్య తన ఫిట్‌నెస్ గురించి కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో ముచ్చటించాడు.

ఈ సంభాషణలో అతని రహస్య కోచ్ గురించి కూడా తెలసింది. ఆ సీక్రెట్ కోచ్ వల్లే అతను ప్రపంచంలోనే నంబర్ వన్ టీ20 బ్యాటర్ అయ్యాడని చెప్పుకొచ్చాడు. ఇంతకీ ఆ సీక్రెట్ కోచ్ మరెవరో కాదు ఆయన భార్య దేవిషా.

2016లో పెళ్లయిన తర్వాత నా భార్య న్యూట్రిషనిస్ట్‌గా ఉండాలని, ఫిట్‌గా ఉండాలని పట్టుబట్టి పని చేసింది. ఇంటికి వచ్చిన తర్వాత ఇద్దరం క్రికెట్ గురించి చాలా మాట్లాడుకునేవాళ్లం. మనం ఎలా మెరుగ్గా ఉండాలో చర్చించుకునేవాళ్లం.





























