Sankranti Special Trains 2023: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్తున్నారా? ఏపీ, తెలంగాణ మధ్య తేదీల వారీగా స్పెషల్ ట్రైన్స్ ఇవే..
తెలుగు రాష్ట్రాల నుంచి సంక్రాంతికి సొంత ఊర్లకు వెళ్లేవారి సంఖ్య తక్కువేమీకాదు. ఐతే పండగ వేళ బస్సులు, ట్రైన్‌లకు సంబంధించిన సరైన సమాచారం లేక ఇబ్బందులు పడకుండా ఇండియన్ రైల్వే తీపికబురు..
తెలుగు రాష్ట్రాల నుంచి సంక్రాంతికి సొంత ఊర్లకు వెళ్లేవారి సంఖ్య తక్కువేమీకాదు. ఐతే పండగ వేళ బస్సులు, ట్రైన్‌లకు సంబంధించిన సరైన సమాచారం లేక ఇబ్బందులు పడకుండా ఇండియన్ రైల్వే తీపికబురు అందించింది. స్పెషల్ ట్రైన్‌లకు సంబంధించిన వివరాలను తెలియజేస్తూ ప్రకటన వెలువరించింది. ఏ ఏ రూట్లలో అదనంగా ట్రైన్లు నడువనున్నాయో తేదీల వారీగా తెలియజేసింది.
ట్రైన్ నెంబర్ 08505
జనవరి 11, జనవరి 13, జనవరి 16 తేదీల్లో విశాఖ పట్నం నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లే సంక్రాంతి స్పెషల్ ట్రైన్ ఇది. ఈ ట్రైన్ రాత్రి 7.50 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరి ఆ తర్వాత రోజు ఉదయం 7.10 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది.
ట్రైన్ నెంబర్ 08506
జనవరి 12, జనవరి 14, జనవరి 17 తేదీల్లో సికింద్రాబాద్ నుంచి విశాఖ పట్నంకు వెళ్లే స్పెషల్ ట్రైన్ ఇది. రాత్రి 7 గంటలకు ప్రారంభమై ఆ తర్వాత రోజు ఉదయం 8 గంటల 20 నిముషాలకు విశాఖ పట్నంకు చేరుకుంటుంది.
వీటితోపాటు ఇతర ప్రాంతాలకు వెళ్లే ట్రైన్ల వివరాలు ఈ కింద తెలియజేసింది.
Secunderabad – Visakhapatnam #Sankranti #SpecialTrains pic.twitter.com/DBzEP0XKif
— South Central Railway (@SCRailwayIndia) January 9, 2023
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.