యూత్ అంటే పబ్‌లు, పార్టీలే కాదు బ్రో.. ఇలా కూడా ఉంటారు.. గ్రామం కోసం వీరు ఏం చేశారంటే..
యూత్ అంటే.. పబ్ లు.. పార్టీలు, సినిమాలు అంటూ ఎంజాయ్ చేస్తూ రోడ్లు వెంట తిరుగుతారనేది ఒక ఫీలింగ్. కొందరి వాలకం అలా ఉంటుంది కాబట్టి.. చూసేవారు కూడా అలాగే ఫిక్స్ అయిపోతారు.
యూత్ అంటే.. పబ్ లు.. పార్టీలు, సినిమాలు అంటూ ఎంజాయ్ చేస్తూ రోడ్లు వెంట తిరుగుతారనేది ఒక ఫీలింగ్. కొందరి వాలకం అలా ఉంటుంది కాబట్టి.. చూసేవారు కూడా అలాగే ఫిక్స్ అయిపోతారు. కానీ, వీరు మాత్రం పూర్తిగా భిన్నం. యూత్ అంటే జల్సాలు చేసేవారు కాదని, అందుకు భిన్నంగా దైవ భక్తి తో తాము పుట్టిన గ్రామం సుభిక్షంగా ఉండాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ కుల దైవమైన శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ దీక్షను మాల గా స్వీకరించారు. అంతేకాదండోయ్.. స్వామి వారి దర్శనం కోసం విజయనగరం జిల్లాలోని శృంగవరపుకోట నుంచి తెలంగాణలోని యాదాద్రి ఆలయానికి సైకిల్ యాత్ర చేపట్టారు.
03 రోజులుగా సైకిల్‌పై ప్రయాణిస్తూ వస్తున్న ఇద్దరు స్వాములు.. ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు టీవీ9 ప్రతినిధితో ముచ్చటించారు. భక్తి శ్రద్ధలతో స్వామి మాల ధరించి తెలంగాణలోని యాధాద్రి టెంపుల్ శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ దర్శనం కోసం సైకిల్ యాత్రగా బయల్దేరామన్నారు. కలలోకి స్వామి వారు వచ్చి మొక్కులు చెల్లించమని చెప్పడంతో.. ముడుపు కట్టి స్వామి మాలను స్వీకరించామని చెప్పారు. స్వామివారి దర్శనం కోసం సైకిల్ యాత్ర చేపట్టామని, ఈ రోజు సత్తుపల్లి చేరుకున్నామన్నారు. ఇప్పటికీ 450 కిలోమీటర్లు ప్రయాణించినట్లు వారు తెలిపారు. ఇంకా 350 కిలోమీటర్లు పైగా సైకిల్ యాత్ర కొనసాగించాల్సి ఉందని అన్నారు. సైకిల్ యాత్రతో స్వామి దర్శనం చేసుకోవాలని శృంగవరపు కోట నుంచి బయల్దేరిన యువకులకు స్థానికులు అభినందలు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..