పెళ్లికాకుండానే తల్లైంది.. అప్పుడే పుట్టిన పసికందును మూడో అంతస్తు నుంచి విసిరేసింది..

పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనిచ్చిన ఓ యువతి (20) అప్పుడే పుట్టిన పసికందును వాష్‌రూం నుంచి బయటికి విసిరేసింది..

పెళ్లికాకుండానే తల్లైంది.. అప్పుడే పుట్టిన పసికందును మూడో అంతస్తు నుంచి విసిరేసింది..
Throws Newborn Baby From Apartment
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 10, 2023 | 8:29 AM

పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనిచ్చిన ఓ యువతి (20) అప్పుడే పుట్టిన పసికందును వాష్‌రూం నుంచి బయటికి విసిరేసింది. ఢిల్లీలోని న్యూ అశోక్‌ విహార్‌లో సోమవారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

యువతి నోయిడాలోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఈ క్రమంలో సోమవారం ప్రసవించింది. అనంతరం బిడ్డను వదిలించుకోవాలనే తాపత్రయంలో అపార్ట్‌మెంట్‌ మూడో అంతస్తునుంచి బయటకు విసిరేసింది. తీవ్ర గాయాలతో రోడ్డుపై పడివున్న బిడ్డను స్థానికులు హుటాహుటీన ఎల్బీఎస్‌ హాస్పిటల్‌కు తరలించగా.. పరీక్షించిన వైద్యులు బిడ్డ మృతి చెందినట్లు ధృవీకరించారు. దీంతో రంగంలోకి దిగిన డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్ పోలీస్‌ అమృత గుగులోత్ అదే ఏరియాలో విచారించగా ఓ ఇంటిలో రక్తం నమూనాలు దొరికాయి. దీంతో సదరు యువతిని ప్రశ్నించగా మగబిడ్డకు జన్మనిచ్చి వాష్‌రూమ్ కిటికీ నుంచి బయటకు విసిరేనట్లు అంగీకరించింది. వివాహంకాకుండానే బిడ్డకు తల్లిలైనే సమాజంలో తనకు చెడ్డపేరు వస్తుందనే భయంతో ఈ పని చేసినట్లు తెల్పింది. యువతిపై కేసు నమోదు చేసుకుని వైద్య పరీక్షల నిమిత్తం ఆమెను ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

తాజా క్రైం సమాచారం కోసం క్లిక్‌ చేయండి.