Remote Voting: ఓటర్లకు ఇక ప్రయాణ భారం తప్పినట్లే.. రిమోట్ ఓటింగ్‌పై సీఇసీ ప్రజెంటేషన్..

ఇక ఓటేసేందుకు సొంతూరుకు వెళ్లక్కర్లేదు! ఉన్నదగ్గరే ఓటు వేసేలా ..సీఈసీ కొత్తగా రిమోట్ ఓటింగ్ మిషన్‌ను తీసుకురాబోతుంది. దీంతో ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ఓ సరికొత్త ప్రయత్నానికి..

Remote Voting: ఓటర్లకు ఇక ప్రయాణ భారం తప్పినట్లే.. రిమోట్ ఓటింగ్‌పై సీఇసీ ప్రజెంటేషన్..
Remote Voting
Follow us
Shiva Prajapati

|

Updated on: Jan 10, 2023 | 8:19 AM

ఇక ఓటేసేందుకు సొంతూరుకు వెళ్లక్కర్లేదు! ఉన్నదగ్గరే ఓటు వేసేలా ..సీఈసీ కొత్తగా రిమోట్ ఓటింగ్ మిషన్‌ను తీసుకురాబోతుంది. దీంతో ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ఓ సరికొత్త ప్రయత్నానికి శ్రీకారం చుడుతోంది. ఉపాధి కోసమో, ఉద్యోగరీత్యానో సొంత ఊళ్లను వదిలిపెట్టి వేరే రాష్ట్రాల్లో ఉండే వారు దేశంలో కోట్ల సంఖ్యలో ఉన్నారు. అలాంటి వారు సొంత ఊళ్లకు వెళ్లి ఓటు వేయడం గగనమే. ఆసక్తి లేకనో, ప్రయాణ ఖర్చులను భరించలేకనో వారిలో చాలా మంది ఓటింగ్‌కు దూరంగా ఉంటున్నారు.

అందువల్లనే ఇప్పటికీ దేశంలో ఏ ఎన్నికలు జరిగినా ఓటు హక్కును వినియోగించుకునే వారు సగటున 55 శాతానికి మించడం లేదు. ఈ నేపథ్యంలో దేశంలో ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచడానికి కేంద్ర ఎన్నికల సంఘం అనేక చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం ఓ సరికొత్త ప్రయత్నానికి శ్రీకారం చుడుతోంది. దేశీయంగా వేరే రాష్ట్రాలకు వలస వెళ్లిన వారు తాము ఉన్న చోటునుంచే తమ సొంత నియోజకవర్గాల్లో ఓటు వేసే విధంగా రిమోట్ ఓటింగ్ మిషన్‌ను తీసుకువచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ రిమోట్ ఓటింగ్ మిషన్‌కు సంబంధించి ఎన్నికల సంఘం ఓ కాన్సెప్ట్ నోట్‌ను సిద్ధం చేసింది.

దీంతో పాటుగా ఓ రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ నమూనాను రూపొందించింది. ఒకే పోలింగ్ బూత్‌నుంచి 72 నియోజకవర్గాల్లో ఓటుహక్కును వినియోగించుకునే విధంగా ఈ రిమోట్ ఇవిఎంను రూపొందించారు. దీన పనితీరుని వివరిస్తూ ఢిల్లీలో డెమోను చూపిస్తూ ప్రజెంటేషన్ చేశారు. ఇందులో ఎలాంటి సాంకేతిక సమస్యలను గుర్తించి పరిష్కరించాల్సిన అవసరం ఇసి ఉందని వివరించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..