Viral Video: ప్రయాణికులతో బయల్దేరిన విమానం.. 2,800 మీటర్ల ఎత్తులో ఉండగా డోర్ ఓపెన్..!
ఆ సమయంలో విమానంలో ఆరుగురు సిబ్బంది సహా మొత్తం 25 మంది ప్రయాణికులు ఉన్నారు. సుమారు 2800-2900 మీటర్ల ఎత్తులో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ఇర్ ఎయిరో సంస్థ తెలిపింది.
విమానయానానికి సంబంధించి మరో షాకింగ్’సంఘటన వెలుగు చూసింది. మొన్న విమానంలో ఒక వ్యక్తి మహిళపై టాయిలెట్ చేసిన సంఘటన కలకలం రేపింది. నిన్న మరో విమానంలో హైడ్రాలిక్ సమస్య కారణంగా ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. తాజాగా మరో విమానంలో ఇలాంటి సమస్యే ఎదురైంది. ప్రయాణికులతో బయల్దేరిన విమానం గాల్లో ఉండగానే ఒక్కసారిగా డోర్ తెరుచుకుంది.
రష్యాకు చెందిన ఇర్‌ఎయిరో (IrAero) సంస్థకు చెందిన ఓ విమానం సైబీరియాలోని మగాన్ నగరం నుంచి రష్యాలోని పసిఫిక్ తీరంలోని మగడాన్‌కు బయలు దేరింది. ఆ సమయంలో ఉష్ణోగ్రతలు మైనస్ 41 డిగ్రీలుగా ఉన్నాయి. అయితే, విమానం గాల్లోకి ఎగిరిన కాసేపటికి ఉన్నట్టుండి బ్యాక్ డోర్ ఒక్కసారిగా ఓపెన్ అయ్యింది. ఆ సమయంలో విమానంలో ఆరుగురు సిబ్బంది సహా మొత్తం 25 మంది ప్రయాణికులు ఉన్నారు. సుమారు 2800-2900 మీటర్ల ఎత్తులో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ఇర్ ఎయిరో సంస్థ తెలిపింది.
A hatch of the Russian AN-26-100 plane flying to Magadan opened right in the sky. 25 people were on board. The pilots began landing right away.
A new name of Russian roulette – “Russian plane”?
? MASH pic.twitter.com/TO5k7l1O1F
— Anton Gerashchenko (@Gerashchenko_en) January 9, 2023
జరిగిన సంఘటనతో ప్రయాణికులు ఎవరికీ ఏమీ కాలేదని ఇర్ ఎయిరో సంస్థ ప్రకటించింది. వెంటనే అప్రమత్తమైన విమాన సిబ్బంది.. విమానాన్ని సమీపంలోని విమానాశ్రయంలో ల్యాండ్ చేసినట్లు పేర్కొంది. కాగా, ఈ ఘటనను విమానంలోని ఓ వ్యక్తి వీడియో తీసి పోస్టు చేయడంతో అదికాస్తా వైరల్ అవుతోంది. వీడియో చుసిన నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం