Viral News: పోస్ట్ గ్రాడ్యుయేట్ వ్యక్తి.. రాత్రిపూట కూలీ, పగలు పేద పిల్లలకు పాఠాలు చెప్పే మాస్టారు
సుమారు 12 ఏళ్లుగా అతడు కూలీగా పనిచేస్తున్నానని చెప్పాడు. నైట్ పోర్టర్ ఉద్యోగం. పగటిపూట ఉపాధ్యాయ వృత్తి. అంతేకాకుండా 2006లో ఆగిపోయిన చదువును 2012 నుంచి కొనసాగిస్తున్నాడు
రెండు మూడు ఉద్యోగాలు చేస్తూ జీవనం సాగించే వారు మన మధ్య ఎంతో మంది ఉన్నారు. పని చేసే వారికి పగలు, రాత్రి తేడా లేదు. అయితే మనం ఎవరి కోసం పని చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము. నిర్దిష్ట పనిని ఎందుకు చేస్తాం అనేది ముఖ్యం. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వార్త తెలిస్తే ఆశ్చర్య పోతారు. ఒడిశాకు చెందిన ఈ వ్యక్తి రాత్రి వేళల్లో రైల్వే స్టేషన్‌లో పోర్టర్‌గా పనిచేస్తున్నాడు. పగటి పూట పేద పిల్లలకు చదువు చెప్పే మాస్టర్ అవుతున్నాడు. వివరాల్లోకి వెళితే …
ఒడిశాలోని బెహ్రంపూర్‌కు చెందిన ఈ వ్యక్తి పేరు నగేష్ పాత్రో. వయసు 31. ఓ ప్రైవేట్ కాలేజీలో పార్ట్ టైమ్ లెక్చరర్ గా పనిచేస్తున్నాడు. దాంతో పాటుగా సుమారు 12 ఏళ్లుగా అతడు కూలీగా పనిచేస్తున్నానని చెప్పాడు. నైట్ పోర్టర్ ఉద్యోగం. పగటిపూట ఉపాధ్యాయ వృత్తి. అంతేకాకుండా 2006లో ఆగిపోయిన చదువును 2012 నుంచి కొనసాగిస్తున్నాడు. తాను కూలీగా పని చేసే సమయానికి ఎంఏ పూర్తి చేశానని నగేష్ తెలిపారు.
Odisha | A railway porter by night, Berhampur’s Ch Nageshu Patro becomes a teacher for young and poor children during the day. The 31-year-old also teaches at a private college as a guest lecturer. pic.twitter.com/yZdBetJx5p
— ANI (@ANI) January 8, 2023
ఈ పోస్ట్‌ను ఇప్పటివరకు 82,000 మందికి పైగా చూశారు. నిరుపేద పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి, పట్టుదలతో పనిచేసే ఇలాంటి నిజాయితీపరులు మన దేశానికి అవసరమని నెటిజన్లు అభినందిస్తున్నారు. పిల్లలకు అవసరమైన పాఠ్యపుస్తకాలు, ఇతర వస్తువులను ఈ వ్యక్తికి ఇవ్వండి. అప్పుడు ఈ వ్యక్తి సమర్థవంతంగా బోధించగలడు అని మరొకరు చెప్పారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..